‘సుశాంత్‌ మళ్లీ రావా’.. రియా ఎమోషనల్‌ పోస్ట్‌

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మరణించి నిన్నటితో(సోమవారం) ఏడాది. బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో అతడి ప్రియురాలు రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటోంది. జైలుకు కూడా వెళ్లిన ఆమె బెయిల్‌పై బయటికి వచ్చింది. చాలాకాలం తర్వాత రియా చక్రవర్తి తన

Published : 15 Jun 2021 01:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మరణించి నిన్నటితో(సోమవారం) ఏడాది. బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో అతడి ప్రియురాలు రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటోంది. జైలుకు కూడా వెళ్లిన ఆమె బెయిల్‌పై బయటికి వచ్చింది. చాలాకాలం తర్వాత రియా చక్రవర్తి తన ప్రియుడు సుశాంత్‌ను తలచుకొంటూ ఒక పోస్టు పెట్టింది. సుశాంత్‌ లేని తన జీవితం వ్యర్థం, తన ప్రియుడు లేని లోటు పూడ్చలేనిదంటూ అందులో పేర్కొంది.

‘‘నువ్వు ఇక్కడ లేవన్నది నేను నమ్మకలేకపోతున్నా. కాలమే అన్నింటినీ మాన్పుతుందని అందరూ అంటున్నారు. కానీ.. నువ్వే నా సమయం, సర్వస్వం. నన్ను ఇప్పుడు సంరక్షిస్తుంది కూడా నువ్వే అని నాకు తెలుసు. చంద్రుడి మీద నుంచి టెలిస్కోప్‌తో నన్ను చూస్తున్నావనీ తెలుసు. నన్ను తీసుకెళతావని నేను నీ కోసం ప్రతిరోజు ఎదురుచూస్తున్నా. అణువణువూ వెతుకుతున్నా. నువ్వు నాతోనే ఇక్కడే ఉన్నావు. నిన్ను తలచుకున్న ప్రతిసారీ నా గుండె ముక్కలైపోతోంది. నువ్వు లేవనే బాధ నా శరీరాన్ని దహిస్తోంది.

ఇది రాయడానికి నా హృదయం ఎంతో వేదన అనుభవిస్తోంది. నువ్వు లేకుండా జీవితం లేదు. జీవిత అర్థాన్ని నువ్వు నీతో తీసుకెళ్లిపోయావు. నువ్వు లేని ఈ శూన్యత పూరించలేనిది. ప్రియతమా.. నీకు మల్పువా (ఒక రకమైన తిను బండారం) ఇస్తానని, ఈ ప్రపంచంలోని అన్ని ఫిజిక్స్‌ పుస్తకాలు చదువుతానని మాటిస్తున్నా. దయచేసి మళ్లీ తిరిగి నా దగ్గరికి రావా. ఐ మిస్‌ యూ మై బెస్ట్‌ ఫ్రెండ్‌. మై మ్యాన్‌. మై లవ్’’ అంటూ రియా ఆ పోస్టులో పేర్కొంది. మరోవైపు సుశాంత్‌సింగ్‌ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే కూడా సుశాంత్‌తో ప్రయాణాన్ని గుర్తు చేసుకుంది. కొన్ని వీడియోలు కూడా ఆమె పంచుకుంది.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని