Richa Chadha: పెళ్లి పీటలెక్కనున్న మరో సెలబ్రిటీ జంట...!

బాలీవుడ్‌లో మరో ప్రేమజంట పెళ్లికి సిద్ధమైంది. మసాన్‌ చిత్రంతో గుర్తింపు పొందిన నటి రిచా చద్దా గత కొంతకాలంగా బాలీవుడ్‌ నటుడు అలీ ఫజల్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే.

Published : 16 Sep 2022 18:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌లో మరో ప్రేమజంట పెళ్లికి సిద్ధమైంది. ‘మసాన్‌’ చిత్రంతో గుర్తింపు పొందిన నటి రిచా చద్దా గత కొంతకాలంగా బాలీవుడ్‌ నటుడు అలీ ఫజల్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. 2020 ఏప్రిల్‌లోనే వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వీరి పెళ్లి వాయిదా పడింది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలెక్కనుంది. ఈ విషయాన్ని రిచా తన ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. ‘కొత్త జీవితం రాబోతుంది’ అని అర్థం వచ్చే ఇమేజ్‌ను పోస్ట్‌ చేస్తూ ‘అక్టోబర్ కోసం వేచి చూడలేకపోతున్నా..’ అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది రిచా. ఇక ఈ జంట వారి పెళ్లి రిసెప్షన్‌ను రెండు నగరాల్లో చేసుకునేందుకు ప్లాన్‌ చేసింది. అక్టోబర్‌ 2న దిల్లీలో, అక్టోబర్‌ 7న ముంబయిలో వీరి రిసెప్షన్‌ గ్రాండ్‌గా జరగనుంది.

ఇలా మొదలైన ప్రేమాయణం:

బాలీవుడ్‌ నటుడు అలీ ఫజల్‌, రిచా చద్దా దశాబ్దకాలంగా ప్రేమలో ఉన్నారు. 2012లో ‘ఫక్రీ’ సెట్స్‌లో మొదటిసారి కలుసుకొన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి అలీపై తనకున్న ప్రేమను రిచా వ్యక్తపరిచింది. మొదట్లో ఈ జంట వారి ప్రేమ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని