Rishab Shetty: ‘కాంతార’పై విమర్శలు.. స్పందించిన రిషబ్‌శెట్టి
‘కాంతార’పై ప్రేక్షకులు చూపిస్తోన్న అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు రిషబ్ శెట్టి. విజయోత్సవ యాత్రలో భాగంగా ముంబయికి చేరుకున్న ఆయన సినిమాపై వస్తోన్న విమర్శలపై స్పందించారు.
ఇంటర్నెట్‌డెస్క్: ‘కాంతార’ (Kantara) విజయోత్సవ యాత్రల్లో బిజీగా పాల్గొంటున్నారు కన్నడ నటుడు రిషబ్‌శెట్టి (Rishab Shetty). ఇందులో భాగంగా ముంబయిలో మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. పలువురు చేస్తోన్న విమర్శలపై స్పందించారు.
‘‘విమర్శలపై నేను ఎలాంటి కామెంట్స్ చేయాలనుకోవడం లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. 99.99 శాతం మా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని మేము ఎలా తీశాం.. ఇది ఎంతటి ప్రజాదరణ సొంతం చేసుకుందనేది అందరికీ తెలుసు. కాబట్టి నెగెటివ్ కామెంట్స్‌కు ప్రేక్షకులే సమాధానం చెబుతారు’’ అని రిషబ్ వివరించారు.
ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే ఏ హీరో నటిస్తే బాగుంటుంది? అని అడగ్గా.. ‘‘కాంతార’ సంస్కృతి, సంప్రదాయానికి సంబంధించిన చిత్రం. ఈ సినిమాలోని పాత్రను పోషించాలంటే అక్కడి సంస్కృతిని నమ్మాలి. అర్థం చేసుకోవాలి. బాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్ హీరోలను నేను అభిమానిస్తా. రీమేక్స్‌పై నాకు అంత ఆసక్తి లేదు’’ అని పేర్కొన్నారు. ఇక, ఈ సినిమా బాలీవుడ్‌లోనూ దూసుకువెళ్తోంది. సుమారు రూ.50 కోట్ల వసూళ్లు రాబట్టింది. ప్రేక్షకాదరణను దృష్టిలో ఉంచుకుని థియేటర్ల సంఖ్యను కూడా పెంచినట్లు తెలుస్తోంది.
‘కాంతార’కు ఎదురుదెబ్బ.. ఇకపై దాన్ని ప్రదర్శించకూడదు
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్
-
Politics News
వైకాపాకు వ్యతిరేకంగా ఓటు వేస్తే చేతులు నరుక్కున్నట్లే!: మంత్రి ధర్మాన
-
World News
Russia: చిన్నారి ‘చిత్రం’పై రష్యా కన్నెర్ర.. తండ్రిని బంధించి..బాలికను దూరం చేసి!