Hero Movie Review: రివ్యూ: హీరో
Hero Movie review: రిషభ్‌శెట్టి కీలక పాత్రలో నటించిన ‘హీరో’ ఎలా ఉందంటే?
చిత్రం: హీరో; నటీనటులు: రిషభ్ శెట్టి, గన్వి లక్ష్మణ్, ప్రమోద్‌శెట్టి, అనిరుధ్ మహేశ్, ప్రదీప్ శెట్టి, మంజునాథ్ గౌడ తదితరులు; సంగీతం: బి.అజనీశ్ లోకనాథ్; సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్.కశ్యప్; ఎడిటింగ్: ప్రతీక్‌శెట్టి; నిర్మాత: రిషభ్‌శెట్టి; రచన: ఎం. భరత్ రాజ్, అనిరుధ్ మహేశ్; దర్శకత్వం: ఎం.భరత్‌రాజ్; విడుదల: ఆహా
అటు వైవిధ్య చిత్రాలతో పాటు, ఇటు భారీ యాక్షన్ మూవీలతో పాన్ ఇండియా స్థాయిలో కన్నడ చిత్రాలు సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా యువ దర్శకులు, నటులు సరికొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తున్నారు. ఎం.భరత్‌రాజ్ దర్శకత్వంలో రిషభ్‌శెట్టి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘హీరో’. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. కరోనా కాలంలో అతి తక్కువ మందితో ఒకే లొకేషన్లో ఈ సినిమాను పూర్తి చేశారు. తాజాగా ఆహా ఓటీటీ వేదికగా తెలుగులో విడుదలైంది. మరి ఈ సినిమా కథేంటి? ‘బెల్‌బాటమ్’ ద్వారా తెలుగువారికి సుపరిచితుడైన రిషభ్‌శెట్టి ఇందులో ఎలా అలరించారు?
కథేంటంటే: హీరో(రిషభ్‌శెట్టి) ప్రేమలో విఫలమై ఒక బార్బర్ షాపులో పనిచేస్తుంటాడు. హీరోయిన్(గన్వి లక్ష్మణ్)పై పగ పెంచుకుంటాడు. ఆమెను ఎలాగైనా హత్య చేయాలనుకుంటాడు. ఆమె విలన్(ప్రమోద్‌శెట్టి)ను వివాహం చేసుకుంటుంది. ఊరికి దూరంగా అడవిని తలపించే ఫామ్ హౌస్‌లో మందీ మార్బలంతో విలన్ నివసిస్తుంటాడు. అతని అనుమతి లేకుండా పురుగు కూడా ఆ ప్రాంతంలోకి ప్రవేశించడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితుల్లో విలన్‌కు హెయిర్‌కట్ చేయడానికి హీరో వెళ్లాల్సి వస్తుంది. హీరోయిన్ను చంపి తన పగ కూడా తీర్చుకున్నట్లు ఉంటుందని అనుకుని ఆ బంగ్లాకు వెళ్తాడు. మరి హీరోయిన్ను హీరో చంపాడా? విలన్ ఏం చేశాడు? ఈ క్రమంలో హీరో-హీరోయిన్లకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?
ఎలా ఉందంటే: హీరో-హీరోయిన్ ప్రేమించుకోవటం.. హీరో ఇష్టపడిన అమ్మాయినే విలన్ కూడా ఇష్టపడటం.. ఆమెను బలవంతంగా విలన్ తీసుకెళ్లడం.. రామాయణాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అన్ని భాషల్లో కొన్ని వందల చిత్రాలు వచ్చాయి. ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి. ఒకటి హీరో నేరుగా వెళ్లి విలన్‌తో వీరోచితంగా పోరాటం.. రెండు విలన్ గుంపులో చేరి అతడికి తెలియకుండానే అన్ని రకాలు దెబ్బ కొట్టడం.. ఇప్పటివరకూ ఇలాంటి కథలే వచ్చాయి. కానీ, రిషభ్‌శెట్టి ‘హీరో’ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. తనని కాదని వెళ్లిపోయిన హీరోయిన్ను హీరో హత్యచేయాలనుకోవడం సరికొత్త పాయింట్. ఈ కథా వస్తువును తీసుకుని ప్రేక్షకులను అలరించేలా సినిమా తీయడంలో దర్శకుడు ఎం.భరత్‌రాజ్ విజయం సాధించారు.
హీరో, హీరోయిన్ల ప్రేమకథను, విలన్ క్రూరత్వాన్ని పరిచయం చేస్తూ దర్శకుడు నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆయా సన్నివేశాల్లో కథాగమనం నెమ్మదిగా ఉంటుంది. అయితే, అది విసుగనిపించకుండా పాత్రల మధ్య జరిగే సంభాషణల్లో సునిశిత హాస్యాన్ని జోడించాడు దర్శకుడు. తెలుగు ప్రేక్షకులను అలరించేలా సంభాషణలు ఉంటాయి. ఇక విలన్ ఇంటికి హీరో వెళ్లిన తర్వాత ఏం చేస్తాడు? అన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో మెదులుతుంది. హీరోయిన్ను నిజంగా చంపేస్తాడా? అని ఆసక్తిగా చూస్తున్న ప్రేక్షకుడే కాదు, సినిమాలో ఉన్న హీరోకు కూడా ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. దీంతో విలన్ మనుషులు హీరో, హీరోయిన్లను పట్టుకునేందుకు ప్రయత్నించడం, వారి నుంచి తప్పించుకుని పారిపోయే ఛేజింగ్ సీన్లు నవ్వులు పంచుతూనే అలరిస్తాయి. అయితే, ఇంకాస్త ఉత్కంఠగా వాటిని తీర్చిదిద్దాల్సింది. ప్రీక్లైమాక్స్ ముందు మరో ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు. కమర్షియల్ హీరోలు ఇలాంటి ట్విస్ట్‌లను ఒప్పుకోరు. ఎందుకంటే విలన్ గ్యాంగ్‌ను కొట్టి, ధీరోదాత్తుడు కావాల్సింది హీరో. అందుకు భిన్నంగా సన్నివేశాలు ఉంటాయి. ఆయా సన్నివేశాలు ‘స్వామిరారా’ క్లైమాక్స్‌ను గుర్తుచేస్తాయి. ఓవరాల్‌గా విభిన్న చిత్రాలను ఇష్టపడేవారిని ‘హీరో’ తప్పకుండా అలరిస్తుంది. రక్తపాతం కాస్త ఎక్కువే. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఏ పాత్రకు ఇందులో పేరు ఉండదు. హీరో.. హీరోయిన్.. విలన్ అంతే..!
ఎవరెలా చేశారంటే: స్వతహాగా దర్శకుడు అయిన రిషభ్‌శెట్టి ‘బెల్ బాటమ్’తో కథానాయకుడిగా మారారు. ‘హీరో’తో మరో డిఫరెంట్ స్టోరీని ఎంచుకున్నారు. ఇలాంటి చిత్రాలను ఎంచుకోవడం కాస్త సాహసమనే చెప్పాలి. పైగా నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు. హీరోయిన్ గన్వి లక్ష్మణ్‌కు తొలి చిత్రమే అయినా, చాలా చక్కగా నటించింది. హావభావాలు పలికించడంతో పాటు, ఛేజింగ్ సన్నివేశాల్లోనూ హీరోతో పాటు కష్టపడింది. మిగిలిన వాళ్లంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. డాక్టర్, వంటవాడి పాత్రలు ఎప్పుడు కనపడినా నవ్వులు పంచుతాయి. విలన్ గ్యాంగ్‌లో ఉన్న ఒక పాత్ర హీరోను పట్టుకునే క్రమంలో అడవి పంది కనపడితే అక్కడే హీరోను వదిలేసి మాంసం కోసం దాని వెంట పడటం నవ్వులు పూయిస్తుంది. ఇలా ప్రతి పాత్రకూ ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది.
సాంకేతికంగా సినిమా బాగుంది. ఒకే ఒక లొకేషన్లో సినిమాను మొత్తం పూర్తి చేశారు. అనేక పాత్రలు పెద్దగా గుర్తుండవు. కథాగమనంలో వచ్చి వెళ్లిపోతాయి. అజనీశ్ లోకనాథ్ నేపథ్య సంగీతం బాగుంది. ఫైట్, ఛేజింగ్ సీన్లను ఎలివేట్ చేసింది. అరవింద్ ఎస్.కశ్యప్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. ఎక్కువ స్లోమోషన్ సన్నివేశాలపై దృష్టి పెట్టారు. ప్రతీక్ శెట్టి ఎడిటింగ్ కూడా బాగుంది. సినిమా నిడివి రెండు గంటలు మాత్రమే. ఎం.భరత్‌రాజ్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉంది. దాన్ని అంతే కొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అయితే, ప్రథమార్ధంలో ట్విస్ట్‌లను పక్కన పెడితే, కథాగమనం నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఛేజింగ్ సీన్ల నిడివి కాస్త పెరిగింది. బహుశా ఒకే లొకేషన్లో తీయడం వల్ల చూసిన సన్నివేశమే చూసినట్లు అనిపిస్తుంది. ఒక డిఫరెంట్ మూవీని చూశామన్న భావన ప్రేక్షకుడుకి కలుగుతుంది.
బలాలు
+ దర్శకుడు ఎంచుకున్న పాయింట్, ట్విస్ట్‌లు
+ నటీనటులు
+ సాంకేతిక బృందం పనితీరు
బలహీనతలు
- అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం
చివరిగా: ఈ ‘హీరో’ కమర్షియల్ హీరోలకు భిన్నంగా అలరిస్తాడు!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’.. అధికారికంగా ప్రకటించిన హీరో
ప్రముఖ కథానాయకుడు సూర్య తన 44వ చిత్రాన్ని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
రాఖీభాయ్ లుక్‌లో యశ్.. కేజీఎఫ్3 కోసమేనా?
కన్నడ నటుడు యశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా
రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
అక్షయ్‌తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్‌లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్‌చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్‌పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్