Kantara: కన్నడలో రికార్డులు బద్దలు కొడుతున్న ‘కాంతారా’.. తెలుగులోనూ వస్తోంది!

రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘కాంతారా’ తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ విడుదల చేశారు.

Published : 09 Oct 2022 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కాంతారా’.. ప్రస్తుతం సోషల్‌మీడియాలో దీని గురించే చర్చ. ఇటీవల కన్నడలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొడుతోంది. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఇతర చిత్ర పరిశ్రమల దృష్టిని ఆకర్షించింది. దీంతో మేకర్స్‌ ఈ సినిమాను ఇతర భాషల్లోనూ విడుదల చేస్తున్నారు.

అక్టోబరు 15వ తేదీ నుంచి తెలుగు, హిందీ భాషల్లో ‘కాంతారా’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గీతా ఫిల్మ్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. అడవి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, రిషబ్‌శెట్టి నటన సినిమాపై అంచనాలను పెంచుతోంది.

‘కాంతారా’  అంటే సంస్కృత భాషలో అడవి. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని తిరిగి ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావరణాన్ని ఆహ్లాదకరంగా ఇందులో చూపించారు. ఈ చిత్రంలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని