Kantara: దయచేసి.. ఆ శబ్దాన్ని అనుకరించవద్దు: రిషబ్‌ శెట్టి

తుళునాడులోని భూతకోల సంప్రదాయాన్ని ఆధారంగా చేసుకుని రూపుదిద్దుకున్న చిత్రం ‘కాంతార’. ప్రస్తుతం ఈ చిత్రం దక్షిణాది, ఉత్తరాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

Updated : 21 Oct 2022 14:54 IST

‘కాంతార’లోని సన్నివేశాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ‘కాంతార’ (Kantara). రిషబ్‌ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కర్ణాటక  తుళునాడులోని ఆచారాలను ఆధారంగా చేసుకొని దీన్ని రూపొందించారు. భూతకోల సంస్కృతిని తెలియజేశారు. ఇక, దేవుడు ఆవహించిన సమయంలో కోల ఆడే వ్యక్తులు ‘ఓ..’ అంటూ వింత శబ్దాన్ని చేస్తారని ఈ సినిమాలో చూపించారు. ఆ ధ్వని వినిపించిన ప్రతిసారీ థియేటర్లు దద్దరిల్లిపోయేలా ప్రేక్షకులు రియాక్ట్‌ అవుతున్నారు. ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కూడా.. ‘ఓ’ అంటూ కేకలు వేస్తూ.. సినిమాపై తమ అభిమానాన్ని బయటపెడుతున్నారు.

ఈవిషయంపై తాజాగా నటుడు రిషబ్‌ శెట్టి స్పందించారు. ‘ఓ..’ అనేది కేవలం శబ్దం మాత్రమే కాదని.. అది తమకు ఓ సెంటిమెంట్‌ అని అన్నారు. ‘‘కాంతార’ వీక్షించిన ప్రేక్షకులందరికీ నా చిరు విన్నపం. సినిమాలో ఉపయోగించిన శబ్దాలను అనుకరించొద్దు. ఇదొక ఆచారం, ఆధ్యాత్మిక నమ్మకం. అలాగే ఇది చాలా సున్నితమైన అంశం. దీనివల్ల ఆచారం దెబ్బతినొచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని