Kantara: ‘కాంతార’ క్లైమాక్స్‌ నాకు మాత్రమే తెలుసు..: రిషబ్‌ శెట్టి

కాంతార సినిమా క్లైమాక్స్‌ సీన్స్‌ గురించి రిషబ్‌ శెట్టి(Rishab Shetty) పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందో చిత్రీకరించే వరకు మూవీ యూనిట్‌కు కూడా తెలీదన్నారు. 

Published : 10 Dec 2022 01:51 IST

హైదరాబాద్‌: ఈ ఏడాది అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం కాంతార(Kantara). ఈ సినిమా గురించి ఏ వార్త అయినా ఇప్పటికీ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా ఉంటుంది. అంతలా ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు సినీ ప్రియులు. జనాల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్‌ సన్నివేశాల గురించి రిషబ్‌ శెట్టి మరోసారి మాట్లాడారు. దానికి సంబంధించి కొత్త విశేషాలు పంచుకున్నారు.

‘‘ఇది మాటల్లో వర్ణించలేని అనుభూతి. నేను పంజుర్లీ (Panjurli) దేవతను నమ్ముతాను.. పూజ చేసిన తర్వాతనే సినిమా సన్నివేశాలను చిత్రీకరించేవాడిని. చిన్నప్పటి నుంచి మా ప్రాంతంలో ఉన్న ఆచారాన్ని చూస్తున్నాను. దానికి సంబంధించిన వీడియోలను చూసి ఆ అనుభవాన్ని రాసిపెట్టుకున్నాను. పంజుర్లీ దేవత ఆవహించిన వారిని కూడా చూశాను. కాంతార క్లైమాక్స్‌ కోసం ఇలాంటివి చాలా చూసి స్క్రిప్ట్‌ రాసుకున్నా. ఇక క్లైమాక్స్‌ సన్నివేశాలు ఎలా ఉండాలి అనే విషయం నా మనసులోనే విజువల్స్‌ సిద్ధం చేసుకున్నా. నా మనసులోని ఆలోచనలను కేవలం డీఓపీకి మాత్రమే చెప్పాను. అందుకే క్లైమాక్స్‌లో ఏం జరుగుతుందన్నది ప్రేక్షకులలాగే మా చిత్రబృందానికి కూడా చివరి వరకు తెలీదు’’అన్నారు.

ఇక సినిమాకే హైలైట్‌గా నిలిచిన ఓఁ అనే శబ్దం గురించి మాట్లాడుతూ..‘ఆ శబ్దం నేను అరిచినదే. డబ్బింగ్‌ సమయంలోనూ దానిని మార్చలేదు. దైవకోల సమయంలో  మళ్లీ షూట్‌ చేయడానికి ప్రయత్నించాను. కానీ అది సరిగ్గా రాలేదు. అందుకే అన్ని భాషల్లో నా వాయిసే ఉంటుంది’ అని రిషబ్‌ శెట్టి చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని