Kantara2: ‘కాంతార 2’ ఆసక్తికర విషయాలు చెప్పిన రిషబ్ శెట్టి
‘కాంతార’ (Kantara) రెండో భాగంపై రిషబ్ శెట్టి(Rishabh Shetty) ఆసక్తికర విషయాలు చెప్పారు. ఇప్పటికే పనులు మొదలుపెట్టినట్లు తెలిపారు.
హైదరాబాద్: గతేడాది విడుదలైన ‘కాంతార’ (Kantara) సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం సూపర్ హిట్ అయిన దగ్గరి నుంచి సినీ ప్రియులు దీని సీక్వెల్ కోసం ఎదరుచూస్తున్నారు. ‘కాంతార2’ ఉంటుందని హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) వ్యవస్థాపకుడు విజయ్ (Vijay) గతంలోనే ప్రకటించారు. అయితే దీనిపై ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. తాజాగా కాంతార హీరో రిషబ్ శెట్టి(Rishab Shetty) దీనిపై స్పందించారు. కాంతార రెండో భాగం 2024లో విడుదలవుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలుపెట్టినట్లు చెప్పారు. ఇది కాంతారకు సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని పేర్కొన్నారు. తొలి భాగం కథ ఎక్కడైతే ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను ఇందులో చూపనున్నట్లు చెప్పారు. అలాగే పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌లో ఏం చూపిస్తారని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు రిషబ్‌కు సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించే ఓ పీరియాడికల్ డ్రామాలో కీలకపాత్ర కోసం రిషబ్‌ను సంప్రదించినట్లు చెబుతున్నారు. అయితే రిషబ్ మాత్రం కన్నడ సినిమాలపై దృష్టి పెట్టాలని ఆ ఆఫర్‌ను వదులుకున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Cyber Crime : ఇంట్లో కూర్చోబెట్టే కాజేత
-
World News
Saudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది హజ్ యాత్రికుల మృతి
-
Politics News
Vangalapudi Anitha: 40 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: అనిత
-
Politics News
Raghurama: నాడు తెదేపాలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల వ్యవహరిస్తున్నారు
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక