Ritika Singh: అందుకే షూటింగ్‌ మధ్యలో ఏడ్చేశాను.. భరించలేకపోయా: రితికా సింగ్‌

రితికా సింగ్‌ (Ritika Singh) ప్రధానపాత్రలో నటించిన సినిమా ‘ఇన్‌కార్‌ (InCar)’. తాజాగా ఈ సినిమాలో నటించడంపై ఆమె తన అనుభూతిని పంచుకుంది.

Updated : 03 Mar 2023 13:25 IST

హైదరాబాద్‌: ‘గురు’ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల మనసు దోచేసింది హీరోయిన్‌ రితికా సింగ్‌ (Ritika Singh). తెలుగుతో పాటు తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఇన్‌కార్‌ (InCar)’. యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ఐదు భాషల్లో తెరకెక్కింది. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రితికా మాట్లాడుతూ.. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని చెప్పింది.

‘‘ఈ సినిమా అంతా ఒకే రోజులో జరిగే కథ. ఓ అమ్మాయిని సాయంత్రం కిడ్నాప్‌ చేస్తారు. రాత్రి సమయానికల్లా తనకు ఏం జరిగింది.. కిడ్నాపర్ల నుంచి బయటపడిందా లేదా? అనేది కథ. నేను సినిమా ప్రారంభంలో ఏ కాస్ట్యూమ్స్‌ అయితే వేసుకున్నానో.. చివరి వరకూ అవే కొనసాగించాలి. దాని కోసం ఎంతో కష్టపడ్డాను. నా పాత్రకు ఎంతో కనెక్ట్‌ అయ్యాను. ఒక సీన్‌ అయ్యాక దర్శకుడు కట్‌ చెప్పగానే.. బాగా ఏడ్చేశాను. ఎందుకంటే ఆ సన్నివేశంలో నా పాత్రను అంతా తిడతారు. దానిని నేను భరించలేకపోయాను. అది నాకు చాలా కష్టంగా అనిపించింది. అందుకే షూటింగ్‌ అయ్యాక.. కారు దిగి కాసేపు ఒంటరిగా గడిపాను’’ అని చెప్పింది. 

అయితే.. ఈ మీడియా సమావేశానికి రితికా మూడు గంటలు ఆలస్యంగా రావడంపై పలువురు ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఆమె వారికి క్షమాపణలు చెప్పింది. కావాలని ఆలస్యంగా రాలేదని.. సమాచారం సరిగ్గా అందకపోవడంతో ఇలా జరిగిందని వాళ్లకు వివరణ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని