bigg boss non stop: ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’ నుంచి ఆర్జే చైతు ఎలిమినేట్‌

నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ షో నుంచి ఆర్జే చైతు ఎలిమినేట్‌ అయ్యాడు.

Published : 21 Mar 2022 01:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌’(Bigg boss nonstop). డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ షో నుంచి ఆర్జే చైతు(RJ Chaitu) ఎలిమినేట్‌ అయ్యాడు. మూడో వారానికి సంబంధించి తేజస్విని, అరియానా, ఆర్జే చైతు, అఖిల్‌, నటరాజ్‌, మహేశ్‌, హమీదా, స్రవంతి, మిత్ర, శివలు నామినేషన్స్‌లో ఉండగా, అతి తక్కువ ఓట్లు వచ్చిన ఆర్జే చైతు హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అనంతరం వేదికపైకి వచ్చిన చైతు మాట్లాడుతూ..  తాను చాలా తక్కువ బాధపడతానని, హౌస్‌ నుంచి బయటకు వచ్చినందుకు ఇప్పుడు కాస్త బాధగా ఉందని చెప్పాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో లాంగ్‌ జర్నీ ఉంటుందని ఆశించాననని, కానీ ఇంత త్వరగా బయటకు వచ్చేస్తానని అనుకోలేదన్నాడు. ఇక హౌస్‌లో ఉండాల్సిన వాళ్లలో ఐదుగురు ఎవరు? అని నాగార్జున అడగ్గా, శివ, బిందు, అఖిల్‌, హమీదా, అనిల్‌లతో పాటు అరియానా పేరును ఆర్జే చైతు చెప్పాడు. అలాగే, ఉండకూడని ఐదుగురు ఎవరు? అని అడగ్గా, అజయ్‌, మిత్ర, స్రవంతి, తేజస్విని, అషురెడ్డి పేర్లు చెప్పాడు. ఈ వారం హౌస్‌కు చైతు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఎమలినేట్‌ కావడంతో ఆ బ్యాడ్జ్‌ను అనిల్‌కు ఇవ్వనున్నట్లు తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని