Rocketry: ఓటీటీలోకి ‘రాకెట్రీ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌(Nambi Narayanan) జీవితాన్ని ఆధారంగా చేసుకుని నటుడు మాధవన్‌ (Madhavan) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్‌’ (Rocketry). జులై 1న విడుదలైన...

Updated : 20 Jul 2022 11:20 IST

హైదరాబాద్‌: ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌(Nambi Narayanan) జీవితాన్ని ఆధారంగా చేసుకుని నటుడు మాధవన్‌ (Madhavan) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్‌’ (Rocketry). జులై 1న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడీ  సినిమా ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime) వేదికగా జులై 26 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ విడుదల చేసిందా సంస్థ. ఇక, రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.40 కోట్లు వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా.

కథేంటంటే:

ప్రఖ్యాత ఇస్రో శాస్త్రవేత్త‌, గూఢ‌చ‌ర్యం ఆరోప‌ణ‌ల్ని ఎదుర్కొని నిర‌ప‌రాధిగా బ‌య‌ట‌ప‌డ్డ నంబి నారాయ‌ణ‌న్ జీవిత క‌థే ఈ చిత్రం. అమెరికాలోని ప్రఖ్యాత ప్రిన్స్‌ట‌న్ విశ్వవిద్యాల‌యంలో నంబి నారాయ‌ణ‌న్ చ‌దువుకున్న రోజులు మొద‌లుకొని.. ఆరోప‌ణ‌ల నుంచి విముక్తి కావ‌డం వ‌ర‌కు ఈ క‌థ సాగుతుంది. రాకెట్ సైన్స్ కోసం ఆయన చేసిన కృషి, మ‌నదేశం కోసం చేసిన త్యాగాలను ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందించారు. ఇక, ఈ సినిమాతో నటుడిగానే కాకుండా దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి మార్కులు కొట్టేశారు మాధవన్‌. సూర్య, షారుఖ్‌ ఈ సినిమాలో అతిథి పాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని