Rocky Aur Rani Ki Prem Kahani: రాఖీ... రాణీ.. ఓ అందమైన ప్రేమ కహానీ
రెండు పెద్ద కుటుంబాలలోని ఇద్దరీ వ్యక్తుల ప్రేమకథా చిత్రమే ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’. కరణ్‌జోహార్ చాలా ఏళ్ల విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
రెండు పెద్ద కుటుంబాలలోని ఇద్దరీ వ్యక్తుల ప్రేమకథా చిత్రమే ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’. కరణ్‌జోహార్ చాలా ఏళ్ల విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. గురువారం ఆయన పుట్టినరోజు.దీంతోపాటు ఆయన చిత్రసీమకు వచ్చిన 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’లోని తొలి పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అలియా భట్ జోడిగా అలరించనున్నారు. ‘ఈ సినిమా ఒక అందమైన ప్రేమకథ. రెండు భిన్నమైన కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తుల ప్రేమ ఎంతో ఆసక్తిగా ఉంటుంది. రణ్‌వీర్ పాత్ర తప్పక అందరి మనసులకు చేరువవుతుంది. వారిద్దరి ప్రేమని ఆ రెండు కుటుంబాలు నిర్ణయిస్తాయి.’ అంటూ కరణ్ ఆ కుటుంబాల పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ అన్నారు. ‘నేను సినిమాల్లోకి అడుగుపెట్టి 25ఏళ్లు కావడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఇందులో చాలా నేర్చుకున్నాను, చాలా ఎదిగాను. నా మనసుకు దగ్గరైన మరో చిత్రం మీ ముందుకు రాబోతుంది. నా పుట్టినరోజుని మీతో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ జోడించారు. కరణ్ జోహర్ దర్శకత్వంలో వస్తున్న ‘రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Imran Khan: రూ.1500 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇమ్రాన్‌ఖాన్
-
Crime News
Hyderabad: పెట్రోల్ బంకు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
-
India News
Amit Shah: మణిపుర్ కల్లోలం.. అమిత్ షా వార్నింగ్ ఎఫెక్ట్ కనిపిస్తోందా..?
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
-
Movies News
Social Look: మాల్దీవుల్లో రకుల్‌ప్రీత్ మస్తీ.. బస్సులో ఈషారెబ్బా పోజులు
-
General News
Bhaskar Reddy: ప్రత్యేక కేటగిరీ విచారణ ఖైదీగా వైఎస్ భాస్కర్‌రెడ్డి