Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’లో నా పాత్ర ఇదే..: బాలీవుడ్‌ నటుడు

రోహిత్‌ పాఠక్‌(Rohit Pathak) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాలో తన పాత్ర గురించి వివరించాడు.  

Published : 06 Jan 2023 14:58 IST

హైదరాబాద్‌: చిరంజీవి (Chiranjeevi) హీరోగా బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) (Bobby) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు రోహిత్‌ పాఠక్‌(Rohit Pathak) ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడిన రోహిత్‌.. ‘వాల్తేరు వీరయ్య’లో తన పాత్ర గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

‘‘నేను మెగాస్టార్‌ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటించాను. చిరంజీవి మొదటి పోరాట సన్నివేశం నుంచే నా పాత్ర మలుపు తిరుగుతుంది. సముద్రంపై ఆధిపత్యం చెలాయిస్తుంటాను. ఒకరకంగా చెప్పాలంటే సముద్రానికి రాజుని. ఈ సినిమాలో నాది బంగ్లాదేశ్‌.  తీరప్రాంతం గురించి బాగా తెలిసిన వ్యక్తిని. చిరంజీవి పరిచయ సన్నివేశంలోనూ నేను భాగమవుతాను. నాకు, హీరోకు మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని అన్నారు. ఇక సంక్రాంతికి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఒకేసారి విడుదలవ్వడం గురించి మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరూ సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి వాళ్లకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉంది. నాకు తెలిసిన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో మాస్‌ ప్రేక్షకులు సంక్రాంతికి వీళ్ల సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు’’ అని అన్నారు.  రోహిత్‌ పాఠక్‌(Rohit Pathak) బాలకృష్ణ సినిమాలోనూ ప్రధానపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

చిరంజీవి సరసన శ్రుతి హాసన్‌(Shruti Haasan) నటించిన ఈ ‘వాల్తేరు వీరయ్య’ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన సినిమాలోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందాయి. సంక్రాంతి కానుకగా ఈనెల 13న ఈ సినిమా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని