Rohit Shetty: అల్లుఅర్జున్‌తో సినిమా తీయాలని ఉందన్న బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌

అల్లుఅర్జున్‌తో పనిచేయాలని ఉందని బాలీవుడ్‌ స్టార్‌డైరక్టర్‌ రోహిత్‌ శెట్టి అన్నారు. 

Published : 03 Dec 2022 01:14 IST

హైదరాబాద్‌: ప్రతి సినిమాతో కొత్తదనం చూపిస్తూ తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు అల్లుఅర్జున్‌. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో బన్నీ రేంజ్‌ పాన్‌ ఇండియా స్థాయి దాటి వెళ్లింది. ఈ ఐకాన్‌ స్టార్‌తో సినిమాలు తీసేందుకు ఇప్పుడు దర్శకులు క్యూ కడుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అల్లుఅర్జున్‌తో కలిసి పనిచేయాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఈ వార్తను తెగ షేర్‌ చేస్తున్నారు.

బాలీవుడ్‌ సినిమా ‘సర్కస్‌’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆ సినిమా దర్శకుడు రోహిత్‌ శెట్టి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సౌత్‌ స్టార్స్‌ గురించి మాట్లాడిన ఆయన ఎవరెవరితో సినిమా తీయాలని ఉందో పంచుకున్నారు. ‘‘నాకు దక్షిణాది స్టార్స్‌ అందరితో సినిమా తీయాలని ఉంది. మరీ ముఖ్యంగా అజిత్‌, విజయ్‌, అల్లుఅర్జున్‌, కార్తి లతో పనిచేయడం చాలా ఇష్టం’’ అని చెప్పారు. ఇక రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించిన ‘సర్కస్‌’ సినిమా ట్రైలర్‌ అలరిస్తోంది. రణ్‌వీర్‌ సింగ్‌  ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఆయన సరసన పూజా హెగ్డే, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నటించారు. క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమా డిసెంబర్‌ 23న విడుదలవ్వనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని