Hero Tarun: తరుణ్‌ను అలా చూసి మాకు ఏడుపు వచ్చింది..: రోజా రమణి

మంచి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో తరుణ్‌. తాజాగా రోజా రమణి (Roja Ramani) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తరుణ్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Published : 17 May 2023 01:34 IST

హైదరాబాద్‌: బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు హీరో తరుణ్‌ (Tarun). తర్వాత వరుస విజయాలు అందుకుని సినీ ప్రేక్షకులను అలరించాడు. మంచి సినిమాలతో లవర్‌ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ హీరో ఇటీవల జరిగిన ‘నువ్వే నువ్వే’ 20 ఏళ్ల  కార్యక్రమంలో కనిపించాడు. తరుణ్‌ తల్లి, అలనాటి హీరోయిన్‌ రోజా రమణి (Roja Ramani) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అతడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘తరుణ్‌కు చిన్నప్పటి నుంచి భక్తి ఎక్కువ. ప్రతిరోజూ గంటన్నర సేపు పూజ చేసుకోకుండా బయటకు వెళ్లడు. అలాగే సాయం చేయడంలోనూ ముందుంటాడు. నేను నటించిన తొలి సినిమాకు నాకు నేషనల్‌ అవార్డు వచ్చింది. అలాగే తరుణ్‌ నటించిన తొలి సినిమాకు కూడా తను నేషనల్‌ అవార్డు అందుకున్నాడు. అది అందుకుంటున్నప్పుడు తరుణ్‌ని చూసి నాకు, మావారికి కన్నీళ్లు ఆగలేదు. ఎంతో ఆనందం వేసింది’’ అని చెప్పారు. ఇక తరుణ్‌పై వచ్చిన రూమర్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి ఆధారం లేకుండా రూమర్స్‌ రాస్తారు. అవి చూసినప్పుడు బాధేస్తుంది. ఎందుకిలా రాస్తున్నారనిపిస్తుంది. అసత్య ప్రచారాల గురించి బాధపడడం ఎందుకని.. అలాంటి వార్తలను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అభిమానుల ఆశీర్వాదం వల్ల మేమంతా బాగున్నాం.  తరుణ్‌ పెళ్లి ఒక్కటైతే చాలు. అంతకు మించి ఏం కోరికలు లేవు. అది సమయం వచ్చినప్పుడు అవుతుంది’’ అని రోజా రమణి తెలిపారు.

అలాగే తరుణ్‌ త్వరలోనే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆమె వెల్లడించారు. వెబ్‌ సిరీస్‌తో పాటు ఒక సినిమాను కూడా ఓకే చేసినట్లు చెప్పారు. అయితే ఈ రెండింటిలో ఏది ముందు విడుదలవుతుందో చూడాలన్నారు. ప్రేక్షకుల ఆశీర్వాదంతో తరుణ్‌ కచ్చితంగా మరోసారి సినీ రంగంలో రాణిస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని