Priyanka Nalkari: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న నటి.. తెలుగులో ఏయే సినిమాలు చేసిందంటే?
ప్రముఖ బుల్లితెర నటి ప్రియాంక నల్కారి (Priyanka Nalkari) తన ప్రేమికుడిని వివాహం చేసుకుంది. మలేషియాలోని ఓ గుడిలో వీళ్ల పెళ్లి జరిగింది.
హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకు సుపరిచతమైన నటి ప్రియాంక నల్కారి (Priyanka Nalkari) సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. తన ప్రేమికుడు రాహుల్ వర్మ (Rahul Varma) తో గుట్టుచప్పుడు కాకుండా ఏడడుగులు వేసింది. మలేషియాలోని ఓ ఆలయంలో వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ ఫొటోలను ప్రియాంక తన సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు, అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతుండగా ఫొటోలు వైరలవుతున్నాయి. ప్రియాంక పెళ్లి చేసుకున్న రాహుల్ వర్మ ఓ వ్యాపారవేత్త. అతను కూడా పలు సీరియల్స్‌లో కనిపించారు. ప్రియాంక, రాహుల్ వర్మ ఇద్దరూ ఓ తమిళ సీరియల్‌లో కలిసి నటించారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు.
ఇక ప్రియాంక 2010లో విడుదలైన శర్వానంద్ ‘అందరి బంధువయ’ (Andari Bandhuvaya) సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘కాంచన3’ (Kanchana 3), ‘కిక్2’ (Kick 2) వంటి పలు సినిమాల్లో కనిపించి అలరించింది. బుల్లితెరపై కూడా ప్రియాంక తనదైన ముద్ర వేసుకుంది. తెలుగు, తమిళ సీరియల్స్‌లో ప్రధాన పాత్రలో నటించింది. తమిళంలో ప్రసారమైన ‘రోజా’ సీరియల్ ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. కొన్ని కార్యక్రమాల్లో యాంకర్‌గానూ వ్యవహరించి మెప్పించింది. అలాగే గెటప్ శ్రీనుతో కలిసి ప్రత్యేక ఈవెంట్‌లలో అలరించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
సిగ్నలింగ్ వ్యవస్థలో తీవ్ర లోపాలు.. 3 నెలల క్రితమే హెచ్చరించిన రైల్వే ఉన్నతాధికారి
-
Ap-top-news News
Tirumala: ప్రొటోకాల్ పరిధిలోని ప్రముఖులకే బ్రేక్ దర్శనాలు
-
Crime News
Khammam: దంత వైద్య విద్యార్థిని ఆత్మహత్య!.. మంటల్లో కాలిపోతుండగా గుర్తింపు..
-
Sports News
Lionel Messi: చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
Ts-top-news News
TSPSC: గ్రూప్-1 ప్రిలిమినరీకి.. 15 నిమిషాల ముందే గేట్ల మూసివేత
-
Politics News
Bandi Sanjay: తెదేపా, భాజపా పొత్తు వ్యవహారం.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు