Selfish: రెండో చిత్రం ఆరంభం

‘రౌడీబాయ్స్‌’తో పరిచయమైన కథానాయకుడు ఆశిష్‌ రెండో చిత్రం ‘సెల్ఫిష్‌’ శుక్రవారం హైదరాబాద్‌లో  మొదలైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా...

Updated : 16 Apr 2022 08:50 IST

‘రౌడీబాయ్స్‌’తో పరిచయమైన కథానాయకుడు ఆశిష్‌ రెండో చిత్రం ‘సెల్ఫిష్‌’ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రంతో విశాల్‌ కాశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలు. ఈ సినిమా ముహూర్తం సన్నివేశానికి ప్రముఖ కథానాయకుడు ధనుష్‌ క్లాప్‌నివ్వగా, దర్శకుడు హరీష్‌శంకర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. మరో దర్శకుడు అనిల్‌ రావిపూడి గౌరవ  దర్శకత్వం వహించడంతోపాటు, మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘సుకుమార్‌... నేను కలిసి ‘ఆర్య’ సినిమా చేశాం. పాన్‌ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘సెల్ఫిష్‌’ కోసం మేం కలవడం ఆనందంగా ఉంది. ఈ కథాలోచన చెప్పినప్పుడే నాకు బాగా నచ్చింది. వెంటనే చేద్దామని దర్శకుడు కాశీకి చెప్పా. కథ చాలా బాగా కుదిరింది. మా ఆశిష్‌ ‘రౌడీబాయ్స్‌’తో నటుడిగా నిరూపించుకున్నాడు. తొలి సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో రెండో సినిమా కోసం రంగంలోకి దిగాడు. తొలి సినిమాతో పోలిస్తే తనకి ఇదొక పెద్ద సవాల్‌గా నిలుస్తుంది. మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మణికందన్‌.ఎస్‌, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కళ: యల్లయ్య.ఎస్‌, సాహిత్యం: చంద్రబోస్‌, సహనిర్మాతలు: హర్షిత్‌రెడ్డి, హన్షితరెడ్డి, అశోక్‌ బండ్రెడ్డి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని