Rowdy Rohini: రౌడీ రోహిణికి సర్జరీ.. 10 గంటలు శ్రమించిన వైద్యులు

నటి రౌడీ రోహిణి (Rowdy Rohini) మరోసారి ఆస్పత్రిలో చేరారు.

Published : 18 May 2023 01:37 IST

హైదరాబాద్‌: కాలు సర్జరీ నిమిత్తం నటి రౌడీ రోహిణి (Rowdy Rohini) విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. పది గంటలపాటు శ్రమించి వైద్యులు తన కాలులో ఉన్న రాడ్‌ను తొలగించారని ఆమె తెలిపారు. ఈ మేరకు తన యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా ఆమె ఓ వీడియో షేర్‌ చేశారు.

‘‘కాలులో ఉన్న రాడ్‌ను తీయించుకోవడం కోసం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఇటీవల జాయిన్‌ అయ్యాను. రాడ్‌ స్కిన్‌కు బాగా అటాచ్‌ అయిపోయిందని, తీయడానికి వీలుపడదని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే యాక్సిడెంట్‌ అయినప్పుడు నాకు చికిత్స అందించిన డాక్టర్‌ను సంప్రదించి, సర్జరీ నిమిత్తం విజయవాడకు వచ్చాను. పది గంటలపాటు శ్రమించి ఇక్కడ వైద్యులు నా కాలులో ఉన్న రాడ్‌ను తొలగించారు. సుమారు ఆరు వారాలపాటు కాలుపై బరువు పెట్టొద్దని సూచించారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి సెట్‌లోకి అడుగుపెట్టాలనుకుంటున్నా’’ అంటూ రోహిణి తెలిపారు.

ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘జబర్దస్త్‌’ షోతో రోహిణి బాగా పాపులర్‌ అయ్యారు. ప్రస్తుతం ఆమె పలు సినిమాల్లోనూ నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘సేవ్‌ ది టైగర్స్‌’ సిరీస్‌లో ఆమె కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదిలా ఉండగా, రోహిణికి గతంలో యాక్సిడెంట్‌ అయ్యింది. అప్పుడు వైద్యులు.. ఆమె కాలులో రాడ్‌ వేశారు. వర్క్‌ లైఫ్‌లో ఫుల్‌ బిజీగా ఉండటంతో రాడ్‌ను తీయించుకోవడానికి ఆమెకు వీలుపడలేదు. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో సర్జరీ చేయించుకుని రాడ్‌ను తొలగించుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని