సందీప్‌ కిషన్‌ ‘రౌడీబేబి’ టైటిల్‌ మారింది

కోన వెంకట్‌ సమర్పణలో సందీప్‌ కిషన్‌ హీరోగా డైరెక్టర్‌ జి.నాగేశ్వరరెడ్డి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘రౌడీ బేబి’ టైటిల్‌తో చిత్రీకరణ పనులు జరుగుతున్నాయి. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆ టైటిల్‌ను మార్చారట.

Published : 13 Mar 2021 22:33 IST

సెట్లో సరదాగా ముచ్చటిస్తున్న చిత్రబృందం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోన వెంకట్‌ సమర్పణలో సందీప్‌ కిషన్‌ హీరోగా డైరెక్టర్‌ జి.నాగేశ్వరరెడ్డి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘రౌడీ బేబి’ టైటిల్‌తో చిత్రీకరణ పనులు జరుగుతున్నాయి. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆ టైటిల్‌ను మార్చారట. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ‘‘రౌడీ బేబి’టైటిల్‌ మారింది. మరో ఆసక్తికరమైన టైటిల్‌ను పెట్టబోతున్నాం. మారింది టైటిల్‌ మాత్రమే. ఫన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ కాదు. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తాం’ అంటూ పేర్కొంది. ఈ సినిమాలో సందీప్‌కిషన్‌ సరసన నేహాశెట్టి సందడి చేయనుంది. చౌరస్తా రామ్‌ సంగీతం అందిస్తున్నారు. సందీప్‌ కిషన్‌, లావణ్యత్రిపాఠి జంటగా ఇటీవల విడుదలైన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ థియేటర్లలో అలరిస్తోంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని