Published : 07 Apr 2022 10:54 IST

Olivia Morris: తారక్‌ని ఆ సీన్‌లో చూసి కన్నీళ్లు వచ్చేశాయ్‌: ఒలీవియా

నా బాయ్‌ఫ్రెండ్‌ ‘నాటునాటు’ ట్రై చేస్తున్నాడు: నటి

ఇంటర్నెట్‌డెస్క్‌: బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో తెలుగు తెరకు పరిచయమైన బ్రిటీష్‌ నటి ఒలీవియా మోరీస్‌. తారక్‌ లవ్‌ లేడీ జెన్నీఫర్‌ పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు సినీ ప్రియుల్ని ఎంతో ఆకట్టుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సక్సెస్‌లో భాగంగా తాజాగా ఒలీవియా ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కెరీర్‌ ఆరంభంలోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం తనకెంతో ఆనందాన్ని అందించిందని ఆమె చెప్పుకొచ్చారు.

‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆడిషన్స్‌ కోసం వీడియో షూట్ చేసి పంపించాను. కొన్ని నెలల పాటు టీమ్‌ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఒక రోజు ఆ టీమ్‌ నుంచి ఫోన్‌ రావడం, నేను వాళ్లకు ఓకే కావడం వెంట వెంటనే జరిగిపోయాయి. రాజమౌళి గొప్ప దర్శకుడు. ఏ సీన్‌ని ఎలా తెరకెక్కించాలనే విషయంలో ఆయనకు స్పష్టత ఉంటుంది. నటీనటులను తనకు కావాల్సిన విధంగా ఆయన మలచుకోగలడు. తారక్‌ అద్భుతమైన వ్యక్తి. సింగిల్‌ టేక్‌ ఆర్టిస్ట్‌. ఎంతో సరదాగా ఉంటాడు. సెట్‌లో ఎక్కువగా నవ్విస్తుంటాడు. సినిమా విడుదలయ్యాక నా బాయ్‌ ఫ్రెండ్‌తో కలిసి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూశా. ‘కొమురం భీముడో’ పాటలో తారక్‌ని చూసి కన్నీళ్లు వచ్చేశాయి. ఆ పాటలో వచ్చే సన్నివేశాలకు నేనెంతో భావోద్వేగానికి గురయ్యా. ఇక చరణ్‌ గురించి చెప్పాలంటే తను నాకు మంచి స్నేహితుడయ్యాడు. మేమిద్దరం లండన్‌ పరిసర ప్రాంతాల గురించి ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నాటునాటు పాట నాకెంతో నచ్చింది. నా బాయ్‌ఫ్రెండ్‌ కూడా ఆ పాటకు ఫ్యాన్‌ అయ్యాడు. ఇంట్లో తరచూ అదే పాట పాడుతున్నాడు. డ్యాన్స్‌ కూడా ట్రై చేస్తున్నాడు’’ అని ఒలీవియా తెలిపారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని