Published : 25 Jun 2022 09:46 IST

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ క్లైమాక్స్‌ ఫైట్‌.. వీఎఫ్‌ఎక్స్‌ కథ ఇదీ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బలమైన కథకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ను జతచేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచే దర్శకుల్లో రాజమౌళి (Rajamouli) ముందు వరుసలో ఉంటారు. రామ్‌చరణ్ (Ram Charan), ఎన్టీఆర్‌ (Jr NTR) కథానాయకులుగా తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)లోనూ ఆయన వీఎఫ్‌ఎక్స్‌కు (Visual Effects) పెద్ద పీట వేసిన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలకు సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ ఎలా జరిగిందో ఇప్పటికే చిత్ర బృందం చూపించింది. ఇప్పుడు ‘క్లైమాక్స్‌ ఫారెస్ట్‌ ఫైట్‌’ విజువల్స్‌కు సంబంధించిన వీడియో విడుదలైంది. ‘మకుట విజువల్‌ ఎఫెక్ట్స్‌’ సంస్థ ఈ పోరాట దృశ్యాలకు విజువల్స్‌ను జోడించింది. దీని కోసం ఆ సంస్థ 240 షాట్స్‌ని క్రియేట్‌ చేసింది. ఈ విజువల్‌ మేకింగ్‌ వీడియోను చూస్తే ఎవరైనా అద్భుతమని అనాల్సిందే.

రూ.1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించిన ఈ క్రేజీ మల్టీస్టారర్‌ ప్రస్తుతం ఓటీటీ ‘జీ 5’లో అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్‌ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. థియేటర్లలోనే కాకుండా ఓటీటీలోనూ ఈ సినిమా హవా కొనసాగిస్తోంది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ ప్రేక్షకులను కట్టిపడేశారు. నటనేకాదు ఈ ఇద్దరి డ్యాన్స్‌ అందరినీ ఉర్రూతలూగించింది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని