RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నయా రికార్డు.. ఆ క్లబ్‌లో చేరిన మూడో చిత్రమిదే

విడుదలైన తొలి రోజు నుంచే ప్రభంజనం సృష్టిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. రెండు వారాల వ్యవధిలో రూ. 1000 (గ్రాస్‌) కోట్ల క్లబ్‌లో చేరిన మూడో చిత్రంగా నిలిచింది.

Published : 10 Apr 2022 17:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విడుదలైన తొలి రోజు నుంచే ప్రభంజనం సృష్టిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో సరికొత్త రికార్డు నెలకొల్పింది. రెండు వారాల వ్యవధిలో రూ. 1000 (గ్రాస్‌) కోట్ల క్లబ్‌లో చేరిన మూడో చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకూ.. ప్రపంచ వ్యాప్తంగా రెండు వారాల్లో రూ. 1000 కోట్లు వసూళ్లు చేసిన తొలి భారతీయ సినిమాగా ‘దంగల్‌’, రెండో చిత్రంగా ‘బాహుబలి 2’ ఉన్నాయి. ఇప్పుడా జాబితాలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చేరడంతో చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ‘‘మిమ్మల్ని అలరించేందుకు మావంతు ప్రయత్నం చేశాం. మీరు వెలకట్టలేని ప్రేమను అందించారు’’ అని పేర్కొంది.

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అలియాభట్‌, ఒలివియా మోరిస్‌, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్‌ ఇండియా సినిమాకి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని