Published : 23 Apr 2022 01:41 IST

RRR: ఇది జపాన్‌ వారి ‘జెండా’.. చరణ్‌, తారక్‌ డ్యాన్స్‌ను అచ్చు గుద్దినట్టు దించేశారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు పాటలంటే తమకు ఎంత ఇష్టమో ఇప్పటికే పలు సందర్భాల్లో జపాన్‌కు చెందిన కొందరు యువకులు తెలియజేశారు. ఉర్రూతలూగించే, డ్యాన్స్‌కు అధిక ప్రాధాన్యమున్న గీతాలకు వారు ఆనందించడమే కాదు బీట్‌కు తగ్గ స్టెప్పులూ వేస్తుంటారు. సంబంధిత వీడియోలను యూట్యూబ్‌ వేదికగా యావత్‌ సినీ అభిమానులతో పంచుకుంటుంటారు. అలా తమ ప్రతిభతో ఎందరితోనూ వావ్‌ అనిపించుకున్న హిరోమునియేర్‌, అసహి ససాకి అనే ద్వయం ఇప్పుడు ‘RRR’లోని ‘ఎత్తర జెండా’ పాటతో అదరగొడుతున్నారు. వీరి సోదరుడూ ఇందులో భాగమయ్యాడు.

చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అలియా భట్‌ ఏ ఫ్రేమ్‌లో ఎలాంటి దుస్తులు ధరించారో అలాంటి వాటినే ధరించి, వారు ఎలాంటి స్టెప్పులేశారో అచ్చు గుద్దినట్టు అలానే వేసి నెటిజన్లను కట్టిపడేస్తున్నారు. ఒరిజినల్‌ వీడియోలో కనిపించిన ప్రతి చిన్న వస్తువు మిస్‌ అవ్వకుండా తమకున్నంత బడ్జెట్‌లోనే బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే ఫొటోలతో సహా అన్నింటినీ కవర్‌ చేశారు. వీరి సృజనాత్మకత, నృత్య ప్రతిభపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంకెందుకు ఆలస్యం జపాన్‌ ‘చరణ్‌’, ‘తారక్‌’, ‘అలియా భట్‌’లు చేసిన ‘ఎత్తర జెండా’ కవర్‌ సాంగ్‌తోపాటు మరికొన్ని వీడియోలను చూసేయండి..







Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని