RRR: నాటు నాటు.. నా మనసులోని భావాలకు అక్షర రూపం ఇచ్చాను: చంద్రబోస్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) లో ‘నాటు నాటు’ పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌‌(Oscar)కు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. దీని గురించి చంద్రబోస్‌ మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నారు.

Updated : 25 Jan 2023 11:52 IST

హైదరాబాద్‌: ఆస్కార్‌ నామినేషన్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్’‌(RRR) సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు చోటుదక్కడంపై సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పాట రాసిన చంద్రబోస్‌(Chandrabose) మాట్లాడుతూ.. ‘‘నాటు నాటు పాట ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌(Oscars 2023)కు నామినేట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. కీరవాణి(Keeravaani), రాజమౌళి(Rajamouli)కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. చిన్న పల్లెటూరి నుంచి వచ్చి, సామాన్య నేపథ్యం ఉన్న నాలాంటి రచయితకు ఇది గొప్ప విజయం. ఇక ‘నాటు నాటు’ రాయడానికి చాలా సమయం పట్టింది. పాటలో రాసిన ప్రతి పదమూ.. నా బాల్యం, నా గ్రామం, నా కుటుంబానికి సంబంధించినదే. నా మనసులోని భావాలకు, జ్ఞాపకాలకు అక్షర రూపం ఇచ్చాను’’ అని అన్నారు.

ఇక ఆస్కార్‌(Oscar) నామినేషన్‌ గురించి మాట్లాడుతూ..‘‘ఇది నాకు నమ్మశక్యం కానిది, ఎంతో అపురూపమైనది. జాబితాలో మొత్తం 15పాటలు ఉన్నాయి. వాటిలో ‘నాటు నాటు’ ఒకటి. ‘అవతార్‌’(Avatar)లోని పాటలకు ‘నాటు నాటు’కు మధ్య పోటీ ఉంటుందని నేను అనుకున్నాను. కానీ, అన్నింటినీ దాటి ఈ(Naatu Naatu) పాట టాప్‌5లో ఉంది’’ అని  చెప్పారు. ఆస్కార్‌కు అడుగు దూరంలో ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈ అవార్డు సొంతం చేసుకుంటుందో లేదో తెలియాలంటే మార్చి 13దాకా వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని