RRR: 6 రోజులు, 9 సిటీలు.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టూర్‌ వివరాలివీ!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రొమోషనల్‌ టూర్‌ వివరాలు. విడుదల సమయం దగ్గరపడటంతో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది.

Published : 18 Mar 2022 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాను తెరకెక్కించడం ఒకెత్తైతే, దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేయడం మరొక ఎత్తు. అందుకే దర్శకనిర్మాతలు.. పక్కా ప్రణాళికతో చిత్రీకరణ పూర్తి చేసినట్టే ప్రొమోషన్స్‌ను పకడ్బందీగా ప్లాన్‌ చేస్తుంటారు. పాన్‌ ఇండియా చిత్రాలైతే ఇంకాస్త శ్రమించాల్సి ఉంటుంది. ప్రతి రాష్ర్టంలోనూ ప్రెస్‌మీట్స్‌, ఈవెంట్స్‌ను ఏర్పాటు చేయాల్సివస్తుంది. అలా భారతీయ సినిమా అభిమానులందరినీ కలిసేందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం సిద్ధమైంది. ఇప్పటికే చెన్నై, ముంబయి, కేరళ, హైదరాబాద్‌లో పలు ప్రెస్‌మీట్స్‌, ప్రీ రిలీజ్‌ ఈవెంట్లను నిర్వహించగా విడుదల సమయం దగ్గరపడటంతో మరికొన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేయబోతుంది. 6 రోజుల సమయంలో 9 నగరాల్లోని సినీ ప్రియుల్ని కలవబోతుంది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా లొకేషన్ల వివరాలతో కూడిన ఓ వీడియోను విడుదల చేసింది.

రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. అలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఎం. ఎం. కీరవాణి స్వరాలందించారు. కొవిడ్‌ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. మార్చి 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రచారాన్ని ముమ్మరం చేసింది.

ప్రొమోషనల్‌ టూర్‌ వివరాలివీ:

18/03/2022:  దుబాయ్‌

19/03/2022: బెంగళూరు

20/03/2022: బరోడా, దిల్లీ

21/03/2022: అమృత్‌సర్‌, జైపుర్‌

22/03/2022: కోల్‌కతా, వారణాసి

23/03/2022: హైదరాబాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని