RRR: 300 రోజులు.. 3000 మంది సాంకేతిక నిపుణులు.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌ జర్నీ

క్రేజీ మల్టీస్టారర్‌, పాన్‌ ఇండియా చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకలోకంతోపాటు చిత్రపరిశ్రమ ఎదురుచూస్తోంది.

Published : 24 Mar 2022 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రేజీ మల్టీస్టారర్‌, పాన్‌ ఇండియా చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ (RRR) ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (Jr NTR) కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎంతో ఆసక్తి నెలకొన్న ఈ సినిమా చిత్రీకరణ ఎక్కడ సాగింది? ఎన్ని రోజుల్లో పూర్తయింది? ఎంతమంది పనిచేశారు? తెలుసుకుందామా...

  1. సినిమా బడ్జెట్‌: సుమారు రూ.500 కోట్లు.
  2. సాంకేతిక నిపుణుల సంఖ్య: 3000.
  3. ఈ చిత్రంలో భాగస్వాములైన కో డైరెక్టర్ల సంఖ్య: 9.
  4. చిత్రీకరణ సమయం: 300 రోజులకుపైగా.
  5. చిత్రీకరణకు ముందు రిహార్సల్ చేసిన సమయం: 200 రోజులు.
  6. షూటింగ్‌ పూర్తి చేసేందుకు ముందుగా అనుకున్న సమయం: 240 రోజులు. తర్వాత, మరో 60 రోజుల వ్యవధి పెంచారు.
  7. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయం: 75 రోజులు. లండన్‌కు చెందిన 2500, అబ్రాడ్‌కు చెందిన 40 మంది ఫైటర్లు
  8. నైట్‌ షూట్‌ (రాత్రివేళ చిత్రీకరణ): 25 నుంచి 28 రాత్రుళ్లు షూట్ చేయాలనుకున్నారు. కానీ, 60 రాత్రుళ్లు పట్టింది.
  9. చిత్రీకరణ జరిగిన ప్రాంతాలు: హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ, రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్టూడియోస్‌, వికారాబాద్, గుజరాత్, బల్గేరియా, నెదర్లాండ్స్‌, ఉక్రెయిన్.
  10. రాజమౌళి తనయుడు కార్తికేయ స్నేహితుడికి చెందిన 10 ఎకరాల స్థలంలో (గండిపేట సమీపంలో) దిల్లీ సెట్ వేశారు.
  11. రామోజీ ఫిల్మ్ సిటీలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ పరిచయ సన్నివేశం, పతాక సన్నివేశం (క్లైమాక్స్‌) చిత్రీకరించారు. బల్గేరియాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ పరిచయ సన్నివేశం, పులితో పోరాడే సన్నివేశం తెరకెక్కించారు. ఉక్రెయిన్‌లోని ‘రియల్ ప్రెసిడెంట్ ప్యాలెస్’ లో ‘నాటు నాటు’ పాటను షూట్‌ చేశారు.
  12. ఈ పాట కోసం డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్ రక్షిత్‌తోపాటు ఓ స్టంట్ కొరియోగ్రాఫర్ పనిచేశారు. ఎమోషన్‌తో కూడిన మాస్‌ బీట్‌ ఇది.
  13. ఎన్టీఆర్ పులితో పోరాడే సన్నివేశానికి సంబంధించిన సీజీ (కంప్యూటర్‌ జనరేటెడ్‌ ఇమేజనరీ) వర్క్‌ లండన్‌లోని ప్రఖ్యాత సంస్థ ఎంపీసీ (మూవింగ్‌ పిక్చర్‌ కంపెనీ)లో జరిగింది. ‘ది లయన్‌ కింగ్‌’ వంటి ఎన్నో హాలీవుడ్‌ చిత్రాల సీజీ పనులు అక్కడే పూర్తయ్యాయి.
  14. నటీనటుల పారితోషకాలు, మార్కెటింగ్‌, ప్రచార బాధ్యతలు రాజమౌళి తనయుడు కార్తికేయ; ఏ రోజు ఏ సీన్‌ షూట్‌ చేయాలి, నిర్మాణాంతర కార్యక్రమాలు సహా విడుదలకు సంబంధించిన వ్యవహారాలు రాజమౌళి వదిన, కీరవాణి సతీమణి శ్రీవల్లి చూసుకున్నారు.
  15. రాజమౌళి గతంలో తెరకెక్కించిన పలు సినిమాల చిత్రీకరణ సమయ వివరాలివీ.. ‘బాహుబలి’ రెండు భాగాలు కలిపి 600 రోజులు. ‘ఈగ’: 180 రోజులు, ‘మర్యాద రామన్న’: 120 రోజులు, ‘ఛత్రపతి’: 140 రోజులు.

ఈ విశేషాలపై  దర్శకుడు సందీప్‌ వంగా- రాజమౌళి ప్రత్యేక ఇంటర్వ్యూపై ఓ లుక్కేయండి... 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని