
RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’.. ‘నాటు నాటు’ ఫుల్ వీడియో వచ్చేసింది
ఇంటర్నెట్ డెస్క్: విడుదలైన (లిరికల్ సాంగ్) క్షణం నుంచే సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన గీతం ‘నాటు నాటు’. ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ఈ మాస్ పాట విదేశీయులనూ విశేషంగా అలరించింది. సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫుల్ వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో లిరికల్ వీడియోలోనే కాస్త రుచి చూసిన వారికి ‘ఇది ఫుల్ మీల్స్’ అనిపించేలా ఉంది.
ఈ పాటలో కథానాయిక ఒలివియా మోరిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఇద్దరితో కలిసి కొన్ని స్టెప్పులేసి సందడి చేసింది. చంద్రబోస్ రచించిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ప్రేమ్ రక్షిత్ నృత్య రీతులు సమకూర్చారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రూ.1000 కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Hyderabad: కన్నులపండువగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
ED: రుణయాప్‌ల కేసుల్లో దూకుడు పెంచిన ఈడీ.. రూ.86.65 కోట్ల జప్తు
-
India News
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్.. మోదీ ప్రకటన
-
General News
‘నా పెన్ను పోయింది.. వెతికిపెట్టండి’.. పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ ఎంపీ
-
General News
Knee Problem: మోకాళ్ల నొప్పులా..? ఇలా చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Bhagwant Mann: రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్ మాన్!
- RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?