Updated : 11 Apr 2022 16:53 IST

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ‘నాటు నాటు’ ఫుల్‌ వీడియో వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: విడుదలైన (లిరికల్‌ సాంగ్‌) క్షణం నుంచే సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన గీతం ‘నాటు నాటు’. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ఈ మాస్‌ పాట విదేశీయులనూ విశేషంగా అలరించింది. సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫుల్‌ వీడియోను చిత్ర బృందం సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి డ్యాన్స్‌ చేస్తే ఎలా ఉంటుందో లిరికల్‌ వీడియోలోనే కాస్త రుచి చూసిన వారికి ‘ఇది ఫుల్‌ మీల్స్‌’ అనిపించేలా ఉంది.

ఈ పాటలో కథానాయిక ఒలివియా మోరిస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఇద్దరితో కలిసి కొన్ని స్టెప్పులేసి సందడి చేసింది. చంద్రబోస్‌ రచించిన ఈ గీతాన్ని  రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ ఆలపించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు. ప్రేమ్‌ రక్షిత్‌ నృత్య రీతులు సమకూర్చారు. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రూ.1000 కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. 


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని