RRR: ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌.. ఓటీటీలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చేస్తోంది..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది. వాళ్లందరూ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ డిజిటల్‌ ప్రిమియర్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో మరో...

Published : 12 May 2022 09:42 IST

హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పడింది. వాళ్లందరూ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ డిజిటల్‌ ప్రిమియర్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. రామ్‌చరణ్‌-తారక్‌ ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ రూ.1000 కోట్ల పైగా వసూళ్లు రాబట్టి కలెక్షన్స్‌ సునామీ సృష్టించింది. ఒకే పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్‌ హీరోలు కలిసి తెరపంచుకోవడంతో ఈ చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూడాలనుకునేవారి సంఖ్య పెరిగింది. దీంతో ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ జీ5.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ డిజిటల్‌ ప్రిమియర్‌ డేట్‌ని ప్రకటించింది. మే 20 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తమ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా అందుబాటులోకి రానుందని తెలిపింది. ఈ ప్రకటనతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చేస్తోంది అంటూ తమ సంతోషాన్ని నెట్టింట్లో పంచుకుంటున్నారు. మరోవైపు అదేరోజున తారక్‌ పుట్టినరోజు కూడా ఉండటంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీ రిలీజ్‌.. తమకి మరింత స్పెషల్‌ అని ఎన్టీఆర్‌ అభిమానులు అంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని