RRR: ఆరోజే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌.. ఎక్కడంటే?

యావత్‌ సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. మార్చి 25న ప్రేక్షకుల ముందుకురానుంది.

Published : 17 Mar 2022 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యావత్‌ సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం మార్చి 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఈనెల 19న నిర్వహిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి ఉన్న కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ వేడుకకు కర్ణాటకలోని అగలగుర్కి (చిక్కబల్లాపుర) వేదికకానుంది. ఈ పాన్‌ ఇండియా సినిమా ఇప్పటికే విడుదల కావాల్సిఉండగా కొవిడ్‌ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావించిన నేపథ్యంలో చెన్నై, కేరళ, ముంబయిలో ముందస్తు విడుదల వేడుకలను చిత్ర బృందం పూర్తి చేసింది. ఇప్పుడు తెలుగు, కన్నడ ప్రేక్షకుల సమక్షంలో ఈవెంట్‌ను ఏర్పాటుచేస్తోంది.

దర్శకుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ కనిపించనున్నారు. అలియా భట్‌, ఒలివియా మోరిస్‌ కథానాయికలు. శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుమారు రూ.400 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని