RRR: రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ల మధ్య ఇంటర్వెల్‌ ఫైట్‌ తీశారిలా!!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలై అటు థియేటర్‌, ఇటు ఓటీటీలోనూ సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకొన్న తరుణంలో కొన్ని సర్‌ప్రైజ్‌ వీడియోలను చిత్రబృందం

Updated : 18 Jun 2022 10:33 IST

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలై అటు థియేటర్‌, ఇటు ఓటీటీలోనూ సూపర్‌ సక్సెస్‌ సొంతం చేసుకొన్న తరుణంలో కొన్ని సర్‌ప్రైజ్‌ వీడియోలను చిత్రబృందం షేర్‌ చేస్తోంది. సినిమాలోని కీలక సన్నివేశాలను ఎలా చిత్రీకరించారు? వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ ఎలా క్రియేట్‌ చేశారు? ఇలాంటి అంశాలు తెలియజేస్తూ గత కొన్నిరోజుల నుంచి వీడియోలు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ వీఎఫ్‌ఎక్స్‌ సంస్థ మకుట  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇంటర్వెల్‌ ఫైట్‌ సీన్‌కు  వీఎఫ్‌ఎక్స్‌ ఎలా చేశారో వెల్లడిస్తూ ఓ వీడియో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సినీ ప్రియుల్ని ఆకర్షిస్తోంది.

రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని రాజమౌళి తెరకెక్కించారు. ఆలియాభట్‌, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, ఒలీవియా మోరీస్‌ కీలకపాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మాత. సుమారు రూ.450 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని