RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. రామ్‌ చరణ్‌ పడిన కష్టమిదీ..!

ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా సందడి మొదలైంది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నట విశ్వరూపం చూపారని, రాజమౌళి టేకింగ్‌ అద్భుమని సగటు ప్రేక్షకుడితోపాటు ప్రముఖులూ నెట్టింట కొనియాడుతున్నారు.

Updated : 26 Mar 2022 06:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా సందడి మొదలైంది. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నట విశ్వరూపం చూపారని, రాజమౌళి టేకింగ్‌ అద్భుమని సగటు ప్రేక్షకుడితోపాటు ప్రముఖులూ నెట్టింట కొనియాడుతున్నారు. ఈ ఆనందోత్సాహంలో రామ్‌చరణ్‌కు శిక్షణ ఇచ్చిన ప్రముఖ బాక్సర్‌ నీరజ్‌ గోయత్‌ ఓ వీడియోను విడుదల చేశారు. తన ఆధ్వర్యంలో చరణ్‌ బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేసిన దృశ్యమది. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో బాక్సింగ్‌కు సంబంధించి కొన్ని ఎపిసోడ్స్‌ మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ సోదరుడు రామ్‌చరణ్‌ ఎంతో కష్టపడి బాక్సింగ్‌ నేర్చుకున్నారు. ప్రాణం పెట్టి నటించారు’’ అని నీరజ్‌ పేర్కొన్నారు. హరియాణాకు చెందిన నీరజ్‌ 2017లో ‘ఆనరరీ బాక్సర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, 2018లో ‘మోస్ట్‌ ప్రామిసింగ్‌ బాక్సర్‌ ఆఫ్ ది ఇయర్‌’ అవార్డులు అందుకున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని తన పాత్ర కోసం చరణ్‌ ఎంత కష్టపడ్డారో మీరూ చూడండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని