RRR: ఓటీటీలోకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. చిత్ర బృందం ఏమందంటే?

ఓటీటీ విడుదలపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందం ఏమందంటే? ఆ వివరాలు తెలుసుకోవాలనుందా....

Published : 16 Apr 2022 01:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా/ కొవిడ్‌ (లాక్‌డౌన్‌) కారణంగా ఓటీటీకి ఆదరణ బాగా పెరిగింది. ఇప్పటికీ కొన్ని చిన్న చిత్రాలు నేరుగా ఓటీటీల్లో విడుదలవుతుండగా పెద్ద సినిమాలు థియేటర్లలో రిలీజైన కొన్ని రోజులకే డిజిటల్‌ మాధ్యమాల్లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎప్పుడెప్పుడొస్తుందా? అని కొందరు ఎదురుచూస్తుంటే, మరికొందరు ‘అతి త్వరలోనే’ అని జ్యోతిషం చెప్పేస్తున్నారు. నెట్టింట పెద్ద చర్చ సాగిస్తున్నారు. దీనిపై చిత్ర బృందం స్పష్టతనిచ్చింది. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీ రిలీజ్‌ ఎప్పుడు?’’ అని ఓ సినీ అభిమాని అడగ్గా ‘‘ఇంకా చాలా సమయం ఉంది’’ అని బదులిచ్చింది. మరోవైపు, ఫుల్‌ వీడియో సాంగ్స్‌ విడుదలపైనా స్పందించింది. శ్రోతల హృదయాన్ని హత్తుకున్న ‘కొమురం భీముడో’ గీతాన్ని అన్నింటికంటే చివరన రిలీజ్‌ చేస్తామని తెలిపింది. మెల్లగా ఒకదాని తర్వాత మరొకటి వస్తాయని చెప్పింది. ఇప్పటికే ‘నాటు నాటు’ పాట విడుదలైన సంగతి తెలిసిందే. ‘కొమ్మా ఉయ్యాలా’ పాట ఫుల్‌ వీడియో శనివారం రానుంది.

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డు మీద రికార్డు సృష్టిస్తోంది. రూ. 1000 కోట్ల క్లబ్‌లో ఇటీవల చేరింది. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించిన తీరు ప్రేక్షకుల్ని మంత్ర ముగ్దుల్ని చేసింది. శ్రియ, ఒలివియా మోరిస్‌, శ్రియ, అజయ్‌ దేవ్‌గణ్‌, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించారు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని