RRR: ‘జపాన్‌లోనూ పేపర్లు ఎగరేశారు’.. ఎవరూ ఊహించి ఉండరన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’
రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ప్రస్తుతం ఈ సినిమా జపాన్‌లో సందడి చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: థియేటర్‌లో స్క్రీన్‌పై తమకు ఇష్టమైన హీరోలు కనిపించగానే కాగితాలు విసిరి ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు సినీ ప్రియులు. ఈ విధమైన సెలబ్రేషన్స్ ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడిదే సెలబ్రేషన్స్ జపాన్‌లో కనిపించాయి. ప్రస్తుతం ఆ దేశంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ మేనియా కొనసాగుతోంది. రామ్‌చరణ్- ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని అక్కడి సినీ అభిమానులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఎప్పుడూ లేనంతగా తెరపై కాగితాలు విసురుతూ.. డ్యాన్స్‌లు చేస్తూ థియేటర్లలో సందడి చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోని చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమ సినిమాకు దక్కుతున్న ఆదరణపై ఆనందం వ్యక్తం చేసింది.
‘‘గాల్లోకి కాగితాలు ఎగరేస్తే స్క్రీన్ కనిపించకూడదు’.. తమ అభిమాన హీరో సినిమా రిలీజైనప్పుడు సినీ ప్రియులు ఇలాగే అనుకుంటారు. జపాన్‌లో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌కు అలాంటి ప్రేమాభిమానాలు దొరుకుతాయని ఎవరూ ఊహించి ఉండరు’’ అని టీమ్ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Rangamarthanda: అందుకే ‘రంగమార్తాండ’కు ప్రచారం చేయలేదు: కృష్ణవంశీ
-
Sports News
Rahul Dravid: ‘నేను స్పిన్ విభాగానికి కోచ్‌గా ఉంటానంటే ద్రవిడ్ వద్దన్నాడు’
-
India News
Rahul Gandhi: దేశం కోసమే నా పోరాటం.. ఎంత మూల్యానికైనా సిద్ధమే..!
-
Movies News
Leo: బిడ్డ పుట్టినా.. అమ్మ మరణించినా.. ‘లియో’ చిత్రీకరణలో టెక్నిషియన్లు!
-
Politics News
Chandrababu: తెదేపా అన్‌స్టాపబుల్.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తాం: చంద్రబాబు
-
Politics News
Priyanka Gandhi: ప్రజాస్వామ్యం కోసం మా కుటుంబం రక్తాన్ని ధారపోసింది!