RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్’కు ఏడాది.. ‘ఆస్కార్’ సహా ఎన్ని అవార్డులు వచ్చాయో తెలుసా..?
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా విడుదలై నేటికి ఏడాది. ఈ సందర్భంగా తమ సినిమాపై విశేష ఆదరణ కనబరిచిన సినీ ప్రియులకు కృతజ్ఞతలు చెబుతూ చిత్రబృందం స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
ఇంటర్నెట్‌డెస్క్: ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR).. తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచం నలుదిశలకు చాటిన చిత్రమిది. రామ్‌చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రధారులుగా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలై నేటి(మార్చి 25)కి ఏడాది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులకు కృతజ్ఞతలు చెబుతూ ఈ సినిమా టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేసింది. ‘‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా విడుదలై నేటితో ఏడాది పూర్తయినప్పటికీ ప్రపంచంలోని ఏదో ఒక చోట ఇప్పటికీ ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డులు పెడుతున్నారు. అవార్డుల కంటే ఈ ఫీలింగ్ మాకెంతో ఆనందాన్ని అందిస్తోంది. మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని టీమ్ పేర్కొంది.
‘ఆస్కార్’, ‘గోల్డెన్ గ్లోబ్’తోపాటు ఇప్పటివరకూ తమ చిత్రానికి వచ్చిన ప్రతిష్ఠాత్మక అవార్డుల వివరాలను ఈ పోస్టర్‌లో పొందుపరిచింది.
ఏయే అవార్డులు వచ్చాయంటే..:
*ఆస్కార్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్
*గోల్డెన్ గ్లోబ్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్
*న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్
బెస్ట్ డైరెక్టర్
*డొరియన్ అవార్డ్స్
నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్
*క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్
బెస్ట్ సాంగ్
*సెలబ్రిటీ ఫిల్మ్ అవార్డ్స్
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్
*బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్
*పండోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్
సాంగ్ కంపోజింగ్
*ఆస్టిన్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్
బెస్ట్ స్టంట్ కో-ఆర్డినేటర్
*అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్
*జార్జియా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్
*హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్
బెస్ట్ యాక్షన్ ఫిల్మ్
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్
బెస్ట్ స్టంట్స్
స్పాట్ లైట్ అవార్డు
*సియాటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ
*ఆన్‌లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటి
బెస్ట్ స్టంట్ కో-ఆర్డినేషన్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్
*హ్యుస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫీచర్
బెస్ట్ ఒరిజినల్ సాంగ్
బెస్ట్ స్టంట్ కో-ఆర్డినేషన్ టీమ్
*ఉటా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్
బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫీచర్
*సౌత్ ఈస్టర్న్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్
బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్
టాప్ టెన్ ఫిల్మ్స్
*న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ ఆన్‌లైన్
టాప్ ఫిల్మ్స్ ఆఫ్ ది ఇయర్
*నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ
టాప్ టెన్ ఫిల్మ్స్
*లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్
బెస్ట్ మ్యూజిక్
*శాటర్న్ అవార్డ్స్
బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో 13 మంది డిబార్
-
Crime News
Nellore: భర్త అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే భార్య మృతి
-
Viral-videos News
Viral Video: ఇదేం వెర్రో..? రన్నింగ్కారుపై పుష్ అప్స్ తీస్తూ హల్చల్!
-
Politics News
Andhra News: జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే స్వాగతిస్తాం: సీపీఐ రామకృష్ణ
-
Movies News
Srikanth Odhela: వైభవంగా ‘దసరా’ దర్శకుడి వివాహం.. నాని పోస్ట్‌తో శుభాకాంక్షల వెల్లువ