RRR Uncut Version: 100 థియేటర్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మళ్లీ రిలీజ్‌ ఎక్కడంటే...

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

Updated : 18 May 2022 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు అందుకుంది. ఈ సినిమా ఇప్పుడు అమెరికాలో మరోసారి విడుదలకు సిద్ధమైంది. జూన్‌ 1న అమెరికాలోని వంద థియేటర్లలో మళ్లీ రిలీజ్‌ అవ్వనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్‌ వేదికగా ప్రకటించింది.

అయితే ఈ సినిమాను కేవలం ఒక్కరోజు మాత్రమే థియేటర్లలో ప్రదర్శిస్తారు. స్పెషల్‌ స్క్రీనింగ్‌ పేరుతో సినిమాలోని తొలగించిన సన్నివేశాలను (deleted scenes) యథాతథంగా ఉంచి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ అన్‌కట్‌ వెర్షన్‌ సినిమాను చూడటం కోసం టిక్కెట్లను అందుబాటులోకి తీసుకురాగా.. అవి వేగంగా అమ్ముడయ్యాయట. మరి ఈ స్పెషల్‌ స్క్రీనింగ్‌ సందడి ఎలా ఉంటుందో చూడాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని