RRR: ‘ఆర్ఆర్ఆర్’ ఖాతాలో మరో అరుదైన అకాడమీ అవార్డు
‘ఆర్ఆర్ఆర్’ మరో అరుదైన అవార్డు సొంతం చేసుకుంది. ‘అవతార్’ లాంటి హాలీవుడ్ చిత్రాలను దాటుకుని జపాన్ 46వ అకాడమీ అవార్ట్ గెలుచుకుంది.
హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’(RRR) చిత్రం విదేశాల్లోనూ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా మరో అరుదైన అవార్డును తన ఖాతాలో వేసుకుంది. జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్(Japan Academy Award)లో అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరిలో ‘ఆర్ఆర్ఆర్’ అవార్డు గెలుచుకుంది. ప్రపంచాన్ని షేక్ చేస్తోన్న ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’(Avatar2: The Way Of Water), ‘టాప్‌గన్: మావెరిక్’(Top Gun: Maverick) వంటి హాలీవుడ్ చిత్రాలను దాటి ఈ జక్కన్న అద్భుతం అవార్డును కైవసం చేసుకుంది. ఇక గతేడాది జపాన్‌లో విడుదలైన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా అక్కడ కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలై మూడు నెలలు దాటినా జపాన్ ప్రజలు ఈ చిత్రాన్ని చూడడానికి థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. అక్కడ ఈ చిత్రాన్ని 4 లక్షల మందికిపైగా వీక్షించారు.
ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ‘గోల్డెన్ గ్లోబ్’ (Golden Globe) పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ నామినేషన్ రేసులో ఉంది. మొత్తం పది భారతీయ చిత్రాలు ఈ బరిలో ఉన్నాయి. కాగా నేడు ఆస్కార్ నామినేషన్స్ వెల్లడి కానున్నాయి. ఏ చిత్రాలు నామినేషన్ దక్కించుకుంటాయోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాది చిత్రాల ఖ్యాతిని ఖండాంతరాలు దాటేలా చేసిన ‘ఆర్ఆర్ఆర్’ కచ్చితంగా ఆస్కార్‌లో చోటుదక్కించుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్‌బాబు-రాజమౌళి మూవీ.. వైరల్‌గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్‌బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్‌ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్‌హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్‌పై దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్‌కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్‌గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అలియా అరుదైన ఘనత.. ప్రశంసించిన హాలీవుడ్ డైరెక్టర్
హీరోయిన్ అలియా అరుదైన ఘనతను సాధించారు. ‘100 మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024’లో చోటు దక్కించుకున్నారు. -
వరుణ్ ఫొటోపై సమంత కామెంట్.. నటుడు ఏమన్నారంటే..?
కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్స్, ఆరోగ్య సూత్రాలు, హెల్త్ అప్డేట్లతో ఇటీవల నెట్టింట యాక్టివ్‌గా ఉంటున్నారు నటి సమంత (Samantha). ఓ బాలీవుడ్ నటుడి ఫొటోపై తాజాగా ఆమె కామెంట్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్‌పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి