RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు అరుదైన గౌరవం.. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఎంపిక

ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో ఘనత సొంతం చేసుకుంది. హాలీవుడ్‌లో ప్రముఖంగా భావించే శాటర్న్‌ అవార్డు దక్కించుకుంది. 

Updated : 26 Oct 2022 13:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో హాలీవుడ్‌ చిత్రాలకు ఇచ్చే శాటర్న్‌ అవార్డు ఈ ఏడాది ఈ చిత్రానికి వరించింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా  జ్యూరీకి కృతజ్ఞతలు చెబుతూ రాజమౌళి (Rajamouli) వీడియో సందేశాన్ని పంపించారు. ‘‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ కేటగిరీలో మా సినిమా  అవార్డు దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా టీమ్‌ అందరి తరఫు నుంచి జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. ‘బాహుబలి - 2’ తర్వాత నాకు వచ్చిన రెండో శాటర్న్‌ అవార్డు ఇది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నాలని అనుకున్నాను. అయితే.. మా సినిమా జపాన్‌లో రిలీజ్‌ కానున్న సందర్భంగా ఆదేశంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అందుకే రాలేకపోయాను. విజేతలందరికీ నా అభినందనలు’’ అని జక్కన్న పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల ఫిక్షనల్‌ కథతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం ఇది. రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధానపాత్రలు పోషించారు. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన ఈసినిమా త్వరలో జపాన్‌లోనూ విడుదల కానుంది.  ఇక, ఈ ఏడాది ‘ఆస్కార్‌’ (Oscars) బరిలోకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దిగుతున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని