Rudrudu: ‘రుద్రుడు’ విచ్చేసేది ఆరోజే

రాఘవ లారెన్స్‌ హీరోగా కతిరేశన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రుడు’. ప్రియా భవానీ శంకర్‌ కథానాయిక. శరత్‌ కుమార్‌, పూర్ణిమ భాగ్యరాజ్‌, నాజర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు

Updated : 04 Jul 2022 07:30 IST

రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) హీరోగా కతిరేశన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రుడు’ (Rudrudu). ప్రియా భవానీ శంకర్‌(Priya Bhavani Shankar) కథానాయిక. శరత్‌ కుమార్‌(Sarath Kumar), పూర్ణిమ భాగ్యరాజ్‌(Poornima Bhagyaraj), నాజర్‌(Nassar) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆదివారం  అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో.. లారెన్స్‌ చేతిలో సీరియస్‌గా చూస్తూ ఆసక్తికరంగా కనిపించారు. ‘‘ఇదొక వినూత్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌. ఇప్పటికే 90శాతం చిత్రీకరణ పూర్తయింది. లారెన్స్‌ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: జి.వి.ప్రకాష్‌ కుమార్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.డి.రాజశేఖర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని