HER Ott release: సైలెంట్‌గా ఓటీటీలోకి ‘హెచ్‌ఈఆర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
నటి రుహానీ శర్మ (Ruhani Sharma) నటించిన ‘హెచ్‌ఈఆర్ చాప్టర్ 1’ (HER Chapter 1 ott Release) చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెట్టింది.
హైదరాబాద్: నటి రుహానీశర్మ (Ruhani sharma) పోలీస్ అధికారి పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘హెచ్‌ఈఆర్ చాప్టర్ 1’ (HER Chapter 1 ott release). శ్రీధర్ స్వరాఘవ్ దర్శకుడు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జులై నెలలో థియేటర్ రిలీజ్ అయ్యింది. మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నేటి నుంచి ఇది ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రుహానీ శర్మ తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. ‘మా చిత్రాన్ని వీక్షించి.. మీ ఆలోచనలు నాతో పంచుకోండి’ అని ఆమె తెలిపారు.
Chandramukhi 2: ‘చంద్రముఖి2’ రన్‌టైమ్.. వామ్మో అన్ని గంటలా..!
కథేంటంటే: హైదరాబాద్ శివార్లలో జంట హత్యలు చోటు చేసుకుంటాయి. ఆ హత్యల వెనక కారణాల్ని నిగ్గు తేల్చేందుకు ఏసీపీ అర్చనా ప్రసాద్ (రుహానీశర్మ) రంగంలోకి దిగుతుంది. పలు కోణాల్లో కేసును పరిశోధిస్తున్న క్రమంలో ఊహించని మలుపులు ఎదురవుతాయి. ఇంతకీ ఆ హత్యల్ని ఎవరు చేశారు? హంతకుల్ని పట్టుకునే క్రమంలో అర్చనకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? మరోవైపు ఆమె ఎన్.ఐ.ఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)లోకి వెళ్లాలని ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? వంటి ఆసక్తికర విషయాలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.