SSMB28: మహేష్‌ సినిమాకు త్రివిక్రమ్‌ ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతారా..!

త్రివిక్రమ్‌ (Trivikram) దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) ఓ సినిమాలో (#SSMB28) నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర టైటిల్‌ వైరలవుతోంది.

Published : 26 Mar 2023 15:17 IST

హైదరాబాద్‌: కొందరి కాంబినేషన్‌లో సినిమాలు వస్తున్నాయంటే నటీనటులు ఎవరనేదాని దగ్గర నుంచి టైటిల్‌ వరకూ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో త్రివిక్రమ్‌ - మహేష్‌ బాబుల సినిమా టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా కావడంతో ఆడియన్స్ ఈ సినిమాకు సంబంధించిన విశేషాల కోసం ఆశగా ఉన్నారు. ఉగాది రోజు ఈ హిట్‌ కాంబో నుంచి ఏమైనా అప్‌డేట్‌ వస్తుందేమోనని నెటిజన్లు ఎదురుచూశారు. అయితే చిత్రబృందం వారికి నిరాశే మిగిల్చింది. తాజాగా ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌మీడియాలో తెగ ప్రచారమవుతోంది (SSMB28 title).

గతంలో ఈ సినిమాకు ‘అయోధ్యలో అర్జునుడు’ అనే టైటిల్‌ ఖరారైంది అనే వార్త చక్కర్లు కొట్టింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర టైటిల్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ‘అమరావతికి అటు ఇటు’ (Amaravati ki Atu Itu) అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలవడలేదు కానీ ఇదే ఫిక్స్‌ అని నెటిజన్లు అంటున్నారు. త్రివిక్రమ్‌ (Trivikram) సినిమాలకు ఎక్కువగా అ, ఆ అనే అక్షరాలతో వచ్చే టైటిల్స్‌నే పెడతారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘అతడు’, ‘అరవింద సమేత’, ‘అ ఆ’, ‘అలవైకుంఠపురంలో’ సినిమాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు మహేష్‌ సినిమాకు కూడా త్రివిక్రమ్‌ ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతారని సినీ అభిమానులు భావిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో మహేశ్‌ సరసన పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు