Salaar: ‘సలార్‌’ రిలీజ్‌ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్‌ నీల్‌ వైఫ్‌ పోస్ట్‌

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్‌’. ఈ సినిమా తొలి భాగం డిసెంబరులో విడుదలకానుందంటూ నెట్టింట చర్చ సాగుతోంది.

Updated : 26 Sep 2023 11:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో ప్రస్తుతం చర్చ సాగుతోన్న అంశాల్లో ‘సలార్‌: పార్ట్‌1’ (Salaar) విడుదల తేదీ ఒకటి. ‘డిసెంబరు 22న సలార్‌ రిలీజ్‌ అవుతుంది’ అని ఓ సినీ విశ్లేషకుడు పోస్ట్‌ పెట్టడం అందుకు కారణం. దాన్ని చూసిన ప్రభాస్‌ అభిమానులు, పలు సినీ వెబ్‌సైట్లు సైతం ఆ చిత్రం డిసెంబరులో వస్తుందంటూ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్‌లు పెట్టాయి. కొందరు ఫ్యాన్స్‌ రిలీజ్‌ డేట్‌తో కూడిన పోస్టర్‌ని సైతం క్రియేట్‌ చేసి, వైరల్‌ చేస్తున్నారు. మరోవైపు, ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ భార్య లిఖితారెడ్డి నీల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పెట్టిన పోస్ట్‌ ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘‘2023 డిసెంబరు ఎప్పటిలా ఉండదు. ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొనడంతో డిసెంబరులో ‘సలార్‌’ రిలీజ్‌ (Salaar Release Date) ఫిక్స్‌ అని అంతా అనుకుంటున్నారు. అయితే, చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన లేదు.

ప్రభాస్‌ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!

ప్రభాస్‌ (Prabhas) హీరోగా ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రుతి హాసన్‌ కథానాయిక. సెప్టెంబరు 28న విడుదలకావాల్సిన తొలి భాగం వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాంతో, వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయని ఇటీవల వార్తలొచ్చాయి. ఇప్పుడు డిసెంబరులో అంటూ ప్రచారం సాగుతోంది.

ఇక ఇదే తేదీన బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ నటించిన ‘డుంకీ’ కూడా  విడుదలకానుంది. దీంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ రెండు చిత్రాలకు పోటీ తప్పదనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షారుక్‌ మాట్లాడుతూ ‘ఈ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకమైనది. జనవరి రిపబ్లిక్‌ డేకు ‘పఠాన్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. సూపర్‌ హిట్‌ అందించారు. అలాగే కృష్ణాష్టమికి ‘జవాన్’ విడుదలైంది. బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇక క్రిస్మస్‌కు ‘డుంకీ’తో రానున్నాను. దాన్ని కూడా ఆదరిస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నా’ అని చెప్పారు. దీంతో డిసెంబర్‌ 22 ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని