Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్‌.. స్టార్‌ హీరోకి తల్లిగా!

ఓ స్టార్‌ హీరోకి తల్లిగా ప్రియమణి నటిస్తుందంటూ రూమర్‌ వచ్చింది. ఆ హీరో ఎవరంటే?

Published : 27 Sep 2023 02:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి ప్రియమణి (Priyamani) సినీ కెరీర్‌ విషయంలో మరో రూమర్‌ వచ్చింది. ఎన్టీఆర్‌ (NTR) అభిమానులను ఆ న్యూస్‌ షాకింగ్‌కు గురి చేసింది. అదేంటంటే.. ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ ‘దేవర’ (Devara) సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నారని, తండ్రి పాత్రకు తల్లిగా ప్రియమణి నటించనున్నారంటూ పలు వెబ్‌సైట్లు రాశాయి. అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఫ్యాన్స్‌ మాత్రం నెట్టింట ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘యమదొంగ’లో జంటగా నటించిన ఎన్టీఆర్, ప్రియమణి ఇప్పుడు తల్లీకొడుకులుగా నటిస్తున్నారనే ఊహాగానాన్ని సైతం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

‘నిత్యామేనన్‌కు తమిళ హీరో వేధింపులు’ స్పందించిన నటి!

మరోవైపు, అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2)లో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్నారని కొన్ని రోజుల క్రితం వదంతులు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూ వేదికగా ఆ వార్తలను ఆమె ఖండించారు. ఆ న్యూస్‌ చూసి తాను షాక్‌ అయ్యానన్నారు. అవకాశం వస్తే తప్పకుండా అల్లు అర్జున్‌తో కలిసి నటించేందుకు సిద్ధమని తెలిపారు. ఇద్దరు అగ్ర హీరోల పాన్‌ ఇండియా చిత్రాల్లో ప్రియమణి నటిస్తుందని ప్రచారం జరగడం గమనార్హం. ఈ ఏడాది.. నాగ చైతన్య ‘కస్టడీ’, షారుక్‌ ఖాన్‌ ‘జవాన్‌’ (Jawan)లో ప్రియమణి విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు