The Gray Man: ‘ది గ్రే మాన్‌’కు సీక్వెల్‌

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకులు రూసో బ్రదర్స్‌ తెరకెక్కించిన చిత్రం ‘ది గ్రే మాన్‌’. ర్యాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఇవాన్స్‌, ధనుష్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా..

Updated : 28 Jul 2022 07:30 IST

ప్రముఖ హాలీవుడ్‌ దర్శకులు రూసో బ్రదర్స్‌(Russo Brothers) తెరకెక్కించిన చిత్రం ‘ది గ్రే మాన్‌’ (The Gray man). ర్యాన్‌ గోస్లింగ్‌, క్రిస్‌ ఇవాన్స్‌, ధనుష్‌ (Dhanush) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా.. ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు రూసో బ్రదర్స్‌. ఈ విషయాన్ని వారే అధికారికంగా ప్రకటించారు. ‘‘ది గ్రే మాన్‌’కి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అద్భుతం. అందరి అంచనాలను అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆసక్తికరమైన పాత్రలున్న ఈ చిత్రాన్ని ప్రాంఛైజ్‌లా కొనసాగించాలన్న ఆలోచన మాకెప్పటి నుంచో ఉంది. త్వరలో తెరకెక్కనున్న సీక్వెల్‌లో మరో కొత్త కోణం చూపించనున్నాం’’ అని రూసో బ్రదర్స్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని