Saakini Daakini: ‘శాకిని డాకిని’ ఓటీటీలోకి వచ్చేస్తున్నారు.. ఎప్పుడంటే?

నివేదా థామస్‌, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని’ . ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది.

Updated : 07 Dec 2022 21:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నివేదా థామస్‌ (Nivetha Thomas), రెజీనా కసాండ్రా (Regina Cassandar) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘శాకిని డాకిని’ (Saakini Daakini). ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది. ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix)లో ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ ప్రకటన చేస్తూ ఆ సంస్థ సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ‘శాకిని డాకిని వస్తున్నారు. భయపడకండి.. ఈసారి ఎంటర్‌టైన్‌ చేయటానికి మాత్రమే’ అని ‘నెట్‌ఫ్లిక్స్‌’ పోస్ట్‌ పెట్టింది. సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 16న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

క‌థేంటంటే: శిక్ష‌ణ కోసం పోలీస్ అకాడ‌మీలో చేరిన యువ‌తులు షాలిని (నివేతా థామస్), దామిని (రెజీనా కసాండ్రా). ఇద్దరివి వేర్వేరు నేపథ్యాలు. తొలుత శత్రువులుగా ఉన్న వారు త‌ర్వాత స్నేహితులవుతారు. ఒక రోజు స‌ర‌దాగా బ‌య‌టికి వెళ్లిన ఆ ఇద్ద‌రూ తిరిగి అకాడ‌మీకి వ‌స్తున్న స‌మ‌యంలో.. రౌడీమూక‌ ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయ‌డాన్ని చూస్తారు. ఆ విష‌యాన్ని ఉన్న‌తాధికారుల‌కి చెప్పినా వాళ్లు ప‌ట్టించుకోరు. కానీ, ఆ ఇద్ద‌రూ తాము చూసిన కిడ్నాప్ వెనుక ఓ పెద్ద ముఠా ఉంద‌ని తెలుసుకుంటారు. తాము పొందుతున్న శిక్ష‌ణ‌ని ఉప‌యోగించుకుని ఆ ముఠాతో ఎలా పోరాడారు?  కిడ్నాప్ అయిన అమ్మాయిని ర‌క్షించారా? అన్నది మిగతా కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని