Sada: బలవంతపు బంధాల కంటే ఒంటరితనం మంచిది..: సదా
ఒంటరిగా ఉండడం మంచిదంటున్నారు నటి సదా. ‘జయం’ సినిమాతో నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె ‘దొంగా దొంగది’, ‘అవునన్నా కాదన్నా’,‘అపరిచితుడు’ లాంటి చిత్రాల ద్వారా తెలుగువారికి చేరువయ్యారు.
హైదరాబాద్: చూడగానే పక్కింటి అమ్మాయి లాగా కనిపించే హీరోయిన్లలో సదా ఒకరు. విభిన్న కథాంశాలతో రూపొందిన చిత్రాల్లో నటించి వివిధ కార్యక్రమాల్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించి తెలుగువారికి ఎంతో దగ్గరైంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలో వ్యక్తిగత బంధాల పై ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
‘‘మనలో చాలా మంది వారికి ఇష్టమైన వ్యక్తులను కోల్పోతారేమో అని భయపడుతుంటారు. ఒకప్పుడు మీకు చాలా సన్నిహితంగా ఉన్నవారు కూడా ఒక్కొక్కసారి మీకు సహకరించరు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న వారు మాత్రమే మీకు పూర్తిగా సహకారం అందించగలరు. మీ ఎదుగుదలకు అడ్డువచ్చే వ్యక్తులను సున్నితంగా తిరస్కరించడం మేలు. మీరు ఒకరి కోసం త్యాగాలు చేసినా గుర్తింపు రాకపోతే మీ అంతరాత్మ చెప్పే మాట వినండి. ఎందుకంటే మన జీవితంలోకి రకరకాలైన మనుషులు వచ్చి పోతుంటారు. కానీ చివరి వరకు మనతో ఉండేది మనం మాత్రమే. ఒకరి నుంచి సంతోషాన్ని ఆశించ వద్దు. అలా చేస్తే మీకు మీరే హాని చేసుకున్న వారవుతారు’’.
‘‘మన ఇంట్లో అవసరం లేని వస్తువులను ఎలా అయితే బయటపడేసి శుభ్రం చేసుకుంటామో.. అలానే మన జీవితాల్లో నుంచి కూడా కొందరిని తీసేసి మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. జీవితం చాలా చిన్నది బలవంతంగా బంధాల్లో ఉండడం కంటే ఒంటరిగా సంతోషంగా ఉండడం మంచిది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: ఇసుక కోసం.. నదిలోనే అడ్డంగా దారి
-
Politics News
Nitish Kumar: కేసీఆర్ సభకు హాజరైతే కాంగ్రెస్‌తో భాగస్వామ్యానికి నష్టం లేదు: నీతీశ్‌కుమార్
-
India News
Rahul Gandhi: రాహుల్‌గాంధీతో ‘ఛోటా రాహుల్’!
-
Ap-top-news News
Andhra News: మా భూమిని లాక్కుంటే ఆత్మహత్య చేసుకుంటా..సెల్ఫీ వీడియో తీసి యువరైతు అదృశ్యం
-
Ap-top-news News
Andhra News: భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద ఒబెరాయ్ సంస్థకు 40 ఎకరాలు!
-
Ap-top-news News
Vande Bharat Express: ‘వందే భారత్’ వచ్చినప్పుడే కాపలానా?