SaiDharam Tej: అమ్మా నన్ను క్షమించు.. సాయితేజ్ ఎమోషనల్
సాయిధరమ్ తేజ్, కార్తిక్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. తాజాగా ఈసినిమా టైటిల్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయితేజ్ భావోద్వేగానికి గురయ్యారు.
హైదరాబాద్: బైకు ప్రమాదం తర్వాత సాయిధరమ్ తేజ్ (Saidharam Tej) నటించిన సరికొత్త చిత్రం ‘విరూపాక్ష’ (Virupaksha). కార్తిక్ దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ బుధవారం విడుదలైంది. తారక్ (NTR) వాయిస్ ఓవర్‌తో సాగిన ఈ టైటిల్ గ్లింప్స్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయి తేజ్ భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లికి క్షమాపణలు చెప్పారు.
‘‘నేను ఈ స్టేజ్‌పై నిల్చొనేలా చేసి, నాకు ఓర్పు, సహనం నేర్పించిన మా ముగ్గురు మావయ్యలకు ఎప్పుడూ రుణపడి ఉంటా. వాళ్ల ప్రేమాభిమానం వల్లే నేను ఇక్కడ ఉన్నా. అమ్మా.. ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్నప్పుడు నీకో విషయం చెప్పలేకపోయా.. ఇప్పుడు చెబుతున్నా.. ‘ఐ యామ్ సారీ, అలాగే లవ్ యూ అమ్మా’. నేను ఈ సినిమా చేసింది, ఇంత కష్టపడింది నీకోసమే. డియర్ తారక్.. 2007లో మొదటిసారి నిన్ను కలిసినప్పుడు ఎంత ప్రేమను చూపించావో ఇప్పటికీ అలాగే నన్ను ప్రేమగా చూసుకున్నందుకు ధన్యవాదాలు. నువ్వు చూపించిన ప్రేమ, చేసిన సాయాన్ని మాటల్లో వర్ణించలేను. ఎవరు ఏమైనా అనుకోని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీ స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా’’ అని సాయి తేజ్ తెలిపారు.
ఇది మూఢ నమ్మకాలకు సంబంధించిన చిత్రం కదా. చిన్నప్పుడు మీరు నమ్మిన మూఢ నమ్మకం ఏమిటి?
సాయితేజ్: మూఢ నమ్మకం అని కాదు. చిన్నప్పటి నుంచి నేను ఆంజనేయస్వామిని నమ్ముతున్నాను. ఆయన ఎప్పుడూ నా పక్కనే ఉంటారని భావిస్తాను.
బైకు ప్రమాదం తర్వాత మీరు నటిస్తోన్న చిత్రమిది. ఈ సినిమా కోసం మీరు ఎంతలా కష్టపడ్డారు?
సాయితేజ్: ప్రమాదం చిన్నదే అయినప్పటికీ.. దాని ప్రభావం నాపై ఎక్కువగా పడింది. దాని నుంచి కోలుకోడానికి సుమారు ఆరు నెలలు సమయం పట్టింది. దర్శకుడు కార్తిక్.. కథతోపాటు నా పాత్ర ఎలా ఉంటుంది?ఎలాంటి ప్రవర్తన ఉంటుంది? ఇలా ప్రతీది ఎంతో క్షుణ్ణంగా వివరించాడు.
‘విరూపాక్ష’ అంటే కనిపించని మూడోకన్ను అన్నారు. చిరంజీవి నటించిన ‘త్రినేత్రుడు’తో దీనికి ఏదైనా సంబంధం ఉందా?
కార్తిక్: అలా ఏమీ లేదు. రెండూ విభిన్నమైన కథలు.
మీ తదుపరి చిత్రాలు ఎలా ఉండనున్నాయి?
సాయితేజ్: ప్రేక్షకులకు మంచి థియేటర్ అనుభవాన్ని అందించడం కోసం కష్టపడుతున్నాను.
నిర్మాత ప్రసాద్‌తో మీరు వరుస సినిమాలు చేస్తున్నారు కదా. తదుపరి చిత్రం కూడా అదే బ్యానర్లోనా?
సాయితేజ్: అవును. నా తదుపరి ప్రాజెక్ట్ ఆయనతోనే చేస్తున్నా. ఆయనను, బాపి అన్నయ్యను వదిలే ప్రసక్తే లేదు.
ఎన్టీఆర్‌తో వాయిస్ ఓవర్ ఇప్పించాలనే ఆలోచన ఎవరిది?
సాయితేజ్: టీమ్ అందరిది. మేమంతా అనుకొని, ఈ డైలాగ్‌కు తారక్ వాయిస్ సరిపోతుందని ఫిక్స్ అయ్యాం. ఆయన్ని కలిశాం. ఆయన వెంటనే ఓకే అన్నారు.
పాన్ ఇండియా మార్కెట్లోకి మీరు కూడా ప్రవేశిస్తున్నారని అనుకోవచ్చా?
సాయితేజ్: ఇది యూనివర్సల్ స్క్రిప్ట్. అందుకే దీన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నాం. అంతకు మించి ఏమీ లేదు.
ఈ కథ ఎప్పుడు ఓకే చేశారు?
సాయితేజ్: 2018లోనే ఈ కథ విన్నా. అప్పటికి వేరే సినిమా షూట్లో ఉండటం వల్ల కాస్త లేట్ అయ్యింది. మధ్యలో కరోనా, తర్వాత చిన్న ప్రమాదం.. దాని వల్ల షూట్ ఆలస్యంగా ప్రారంభించాం.
వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా తీశారా?
కార్తిక్: పేపర్లో ఎన్నో కథనాలు చదివాను. అందులో ఒకటి నన్ను బాగా ఆకట్టుకుంది. దానిని ఆధారంగా చేసుకుని ఈ ఫిక్షనల్ కథ రాశా.
మీ సినిమాలో మళ్లీ సాంగ్ రీమేక్ చేస్తారా?
సాయితేజ్: సాంగ్స్ రీమేక్ చేయడం నేను ఎప్పుడో ఆపేశాను. దర్శకుడు కోరితే చేస్తాను తప్ప.. నా సొంతంగా అలాంటి ప్రయత్నాలు చేయను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రజనీ 171 టైటిల్ అనౌన్స్మెంట్.. లోకేశ్ కనగరాజ్ కామెంట్స్ వైరల్
రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న విషయం తెలిసిందే. త్వరలో ఇది పట్టాలెక్కనుంది. -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’.. అధికారికంగా ప్రకటించిన హీరో
ప్రముఖ కథానాయకుడు సూర్య తన 44వ చిత్రాన్ని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రికార్డు సృష్టించిన మలయాళ చిత్రం.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ హిట్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో విడుదల కానుంది. ఎప్పుడంటే? -
RC17: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అదే హైలైట్: రాజమౌళి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు. -
RC17: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో
రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రకటించారు. స్టార్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్టుకు (#RC17) శ్రీకారం చుట్టారు. -
priyadarshi: ప్రియదర్శి- ఇంద్రగంటి కొత్త సినిమా ప్రారంభం
ప్రియదర్శి కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. -
Kamal Haasan: మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్.. ‘కల్కి’ గురించి ఏమన్నారంటే!
తాను నటిస్తోన్న సినిమాల అప్డేట్లను కమల్ హాసన్ పంచుకున్నారు. -
upcoming movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
upcoming movies: మార్చి ఆఖరి వారంలో అటు థియేటర్లో పాటు, ఇటు ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి. -
War 2: వార్2లో కంపోజర్ ప్రీతమ్ భాగం కానున్నారా?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. -
Double Ismart Movie Update: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌పై రామ్ కామెంట్స్.. ఏమన్నారంటే!
‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రిలీజ్ డేట్‌పై రామ్ కామెంట్ చేశారు. -
Kalki 2898AD: ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
Devara: ‘దేవర’లో మరాఠీ బ్యూటీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన నటి!
ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి వెల్లడించారు. -
SSMB29: మహేశ్-రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేసిన కార్తికేయ.. ఏమన్నారంటే!
రాజమౌళి-మహేశ్ సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ కామెంట్ చేశారు. -
Shiva Rajkumar: ఇది మరో స్థాయిలో ఉంటుంది: రామ్ చరణ్ చిత్రంపై శివ రాజ్‌కుమార్
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. -
Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్ కాఫీ మాత్రమే తాగా: పృథ్వీరాజ్
Aadujeevitham: పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ షూటింగ్ విశేషాలను ఆయన పంచుకున్నారు. -
Pushpa2: ‘పుష్ప2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రష్మిక..ఫొటో వైరల్
‘పుష్ప2’ షూటింగ్ ప్రస్తుతం యాగంటిలో జరుగుతున్నట్లు రష్మిక తెలిపారు. -
Dhanush: అందుకు నేను గర్వపడుతున్నా: ధనుష్
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కింది. -
RamCharan: అట్టహాసంగా రామ్‌చరణ్ కొత్త సినిమా ప్రారంభం
రామ్‌చరణ్ (Ram Charan) కొత్త సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
టీసీఎస్‌లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్‌కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి