sai dharam tej: అతనే నా ప్రాణాలు కాపాడాడు.. సాయిధరమ్‌తేజ్‌ కృతజ్ఞత వీడియో

తాను ప్రాణాలతో బయటపడటానికి కారణమైన వారందరికీ నటుడు సాయి ధరమ్‌తేజ్‌(sai dharam tej) కృతజ్ఞతలు తెలిపారు

Published : 26 Mar 2022 19:41 IST

హైదరాబాద్‌: తాను ప్రాణాలతో బయటపడటానికి కారణమైన వారందరికీ నటుడు సాయి ధరమ్‌తేజ్‌(sai dharam tej) కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న తర్వాత తొలిసారి ఓ వీడియోను విడుదల చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే గుర్తించి ఆస్పత్రిలో చేర్చిన సయ్యద్‌ అబ్దుల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మానవత్వం మిగిలే ఉందని అనడానికి సయ్యద్‌ నిదర్శనమని చెప్పుకొచ్చారు. తనకు మెరుగైన వైద్యం అందించిన వైద్యులు, ఆస్పత్రి సిబ్బందికి రుణపడి ఉంటానని అన్నారు. ఇక చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ సహా సినిమా ఇండస్ట్రీ పెద్దలకు, ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 28న తన కొత్త సినిమా ప్రారంభమవుతోందని, తనకోసం ఇన్ని రోజులు వేచి చూసిన సుకుమార్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌లకు థ్యాంక్స్‌ చెప్పారు. హెల్మెట్‌ పెట్టుకోవడం వల్లే తాను బతికానని ద్విచక్రవాహనంపై వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దాన్ని ధరించాలని పిలుపునిచ్చారు. ఆఖరికి పక్క వీధిలోకి వెళ్లినా హెల్మెట్‌ పెట్టుకోవాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని