Sai Dharam Tej: పవన్‌ కల్యాణ్‌కు సాయిధరమ్‌ తేజ్‌ గిఫ్ట్‌.. అదేంటంటే?

తన మామయ్య, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు హీరో సాయి ధరమ్‌ తేజ ఓ బహుమతి ఇచ్చారు.

Published : 16 Jun 2024 12:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఘన విజయం అందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, జనసేన వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీశాఖలను కేటాయించడంతో ఆ సంతోషం రెట్టింపైంది. ఈ నేపథ్యంలో చిరంజీవి (Chiranjeevi) సతీమణి సురేఖ.. పవన్‌కు అత్యంత ఖరీదైన పెన్నును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) తన మామయ్యకు ఓ గిఫ్ట్‌ అందించారు. సంబంధిత ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘నాకు స్టార్‌వార్స్‌ లెగోను పరిచయం చేసింది మామయ్యే. ఆయనలోని పిల్లాడికి దాన్ని గిఫ్ట్‌గా ఇచ్చే అవకాశం ఇప్పటికి దక్కింది’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

ఫాదర్స్‌ డే.. స్పెషల్‌ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్‌

దాని ధర దాదాపు రూ. 1,30,000. సురేఖ.. పవన్‌కు ఇచ్చిన మోంట్‌ బ్లాంక్‌ డిస్నీ ఎడిషన్‌ పెన్నుల ధరల శ్రేణి రూ.90 వేల నుంచి రూ.2.60 లక్షల వరకూ ఉంది. తన వదిన పవన్‌కు బహుమతి అందిస్తున్న దృశ్యాలు సైతం నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించాయి. కూటమిలో భాగంగా 21 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్నిచోట్లా విజయకేతనం ఎరగేసింది. తన మామయ్య గెలుపుతో శనివారం.. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకుని, మొక్కు తీర్చుకున్నారు సాయిధరమ్‌ తేజ్‌.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని