Hello World: ‘హలో వరల్డ్‌’లో తారలు వీరే.. ఎవరెవరు ఏం చేస్తారంటే

సదా(Sadha), ఆర్యన్‌ రాజేశ్‌ (Aryan Rajesh) ప్రధాన పాత్రలుగా సిద్ధమైన వెబ్‌సిరీస్‌ ‘హలో వరల్డ్‌’ (Hello World). ఫన్‌, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన...

Published : 30 Jul 2022 14:59 IST

హైదరాబాద్‌: సదా(Sadha), ఆర్యన్‌ రాజేశ్‌ (Aryan Rajesh) ప్రధాన పాత్రలుగా సిద్ధమైన వెబ్‌సిరీస్‌ ‘హలో వరల్డ్‌’ (Hello World). ఫన్‌, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సిరీస్‌ ఆగస్టు 12 నుంచి జీ5 వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన యువతీ యువకుల మధ్య ఉండే స్నేహం, ప్రేమ వంటి అనుబంధాలతో నేటితరం యువతను ఆకట్టుకునేలా దీన్ని సిద్ధం చేశారు. ఈ సిరీస్‌లో ఎవరెవరు ఏయే పాత్రలు పోషించారో తెలియజేస్తూ చిత్రబృందం ఓ స్పెషల్‌ వీడియో రూపొందించింది. ఆర్యన్‌ రాజేశ్‌, సదా ఓ పేరు పొందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉన్నతాధికారులుగా కనిపించనున్నారు. అదే ఆఫీస్‌లో కొత్తగా విధుల్లోకి చేరిన వారిగా ‘మై విలేజ్‌ షో’ ఫేమ్‌ అనిల్‌, నిఖిల్‌, నిత్యాశెట్టి, సుదర్శన్‌, రామ్‌ నితిన్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఆ వీడియోని నటుడు సాయిధరమ్‌ తేజ్‌ నెట్టింట షేర్‌ చేస్తూ టీమ్‌కు అభినందనలు తెలిపారు. పింక్‌ ఎలిఫెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నటి నిహారిక దీన్ని నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని